శ్రీ శేషాద్రి స్వామి - ఒక అవధూత
తలచినంతనే అండగా నిలిచే దేవునిగా అరుణాచలేశ్వరుడు ప్రసిద్ది.
ఆయన కొలువు తీరిన "తిరువన్నామలై " ఆధ్యాత్మిక వాదులకు రాజధాని లాంటిది.
ఎందరో కారణ జన్ములు భగవత్ ప్రేరణతో తమంతట తాముగాఈ దివ్య క్షేత్రానికి చేరుకొని ఆ అరుణాచలేశ్వరుని
కృపాకటాక్షాలతో మానవాళికి మార్గ దర్శకులుగా మారి ఎందరికో మానవ జీవిత పరమార్ధం ఏమిటో తెలిపారు.
అలాంటి మహనీయులలో శ్రీ శేషాద్రి స్వామి ఒకరు.
సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం.
జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య, శ్రీవిద్యను దేశ వ్యాప్తంగా వ్యాపింప చేయడానికి ఎంచుకొన్న కొన్ని కుటుంబాలలో ఒకటి "కామకోటి వంశం".
అలాంటి కుటుంబంలో ప్రసిద్దులైన "శ్రీ కామకోటి శాస్త్రి" గారి దత్త పుత్రిక "మరకతమ్మ".
ఆమెకు విద్యావంతుడు, గుణవంతుడు అయిన "వరదరాజన్"తో వివాహమైనది.
కానీ చాలా కాలం ఆ దంపతులకు సంతానం కలుగ లేదు.
మనుమలను ఎత్తుకోవాలన్న ఆశ తీరక పోవడంతో శాస్త్రి గారు కామాక్షి దేవిని ప్రార్ధించారు.
ఆ చల్లని తల్లి కరుణించి ఆయనకు స్వప్న దర్శనమిచ్చి నవనీతాన్ని ( వెన్న) కుమార్తెకు తినిపించమని తెలిపింది.
ఆ ప్రకారం చేయడంతో కొద్ది కాలం లోనే మరకతమ్మ గర్భవతి అయ్యింది.
1870వ సంవత్సరంలో జనవరి ఇరవై రెండో తేదీన కారణ పురుషుడు జన్మించారు.
ఆ శిశువుకు పెద్దలు శనివారం జన్మించినందున శ్రీవారి పేరైన "శేషాద్రి" అని నామకరణం చేసారు. దినదినప్రబద్ధమానంగా పెరుగుతున్న ఆ బిడ్డడిలో దాగున్న అద్భుత శక్తులు బయల్పడి అతను జన్మతః అవధూత అని తెలిపాయి.
నాలుగేళ్ల శేషాద్రి తల్లితో కలిసి ప్రతి నిత్యం ఆలయానికి వెళ్ళేవాడు.
ఒకనాడు కోవెల సమీపంలో ఒక వ్యక్తి శ్రీ కృష్ణ విగ్రహాలను అమ్ముతున్నాడు.
తనకు ఒక బొమ్మ కావాలని తీసుకొన్నాడు బాలుడు.
కానీ డబ్బులు లేవని తల్లి తిరిగి ఇవ్వబొయింది.
బొమ్మలు అమ్మే వ్యక్తి పసివాడు తీసుకొన్నదానికి ఏమీ ఇవ్వక్కరలేదు, అని అన్నాడు.
సంతోషంగా ఇంటికి వచ్చిన శేషాద్రి ఆ బొమ్మను పూజా స్థలంలో ఉంచారు.
మరునాడు గుడికి వెళుతున్న బాలుని పట్టుకొని బొమ్మలు అమ్మే వ్యక్తి "ఏమి చెయ్యి బంగారు చెయ్యి" అంటూ ఒక తన్మయావస్థ లో చెప్పినదే చెప్పసాగాడు.
విషయం ఏమిటా అని విచారిస్తే క్రిందటి రోజున అతను వెయ్యి బొమ్మలు అమ్మాడట.
అదంతా శేషాద్రి చెయ్యి ప్రభావం !
అక్షరాభ్యాసం జరిగిన కొద్ది కాలం లోనే సంస్కృత, తమిళ శ్లోకాలను నేర్చుకొన్నాడు. ఉపనయనం జరిగిన తరువాత పలు శాస్త్రాలను అధ్యనం చేసాడు.
అంతా సాఫీగా సాగుతున్న సమయంలో శేషాద్రి తండ్రి, తాత గారు స్వర్గస్తులైనారు.
పినతండ్రి వద్దకు తల్లి తో కలిసి చేరాడు.
తెలిసిన వారి పిల్లతో పెళ్లి చేద్దామన్న ఆలోచనతో జాతకం చూపించారు.
అతనికి సంసార యోగం లేదు.
కారణ జన్ముడు యోగిగా మారుతాడని చెప్పారు.
అప్పటికే ధ్యానంలో అనేక అనుభూతులను అనుభవిస్తున్నాడు.
తనయుని పెళ్లి చూసే అదృష్టం లేదని తెలిసిన మరకతమ్మ దిగులుతో మంచంపట్టి మరణ శయ్య వద్ద కుమారునికి "అరుణాచల అరుణాచల అరుణాచల " ముమ్మారు పలికి ఆమె ఆయనలో ఐక్యం చెందారు.
జన్మః తహ సర్వసంగపరిత్యాగి అయిన శేషాద్రి తల్లి మరణాన్ని జీవులకు తప్పని సరిగా సంభవించే సహజ పరిణామంగానే తీసుకొన్నారు.
కానీ ఆమె అన్న "అరుణాచల" అన్న పదం తారక మంత్రంలా మనసులో నిలిచి పోయినది. బలమైన ప్రభావాన్ని చూపింది.
ఆయన అప్పటి దాకా కంచి దాటి వెళ్ళినది లేదు.
ధ్యానంలో స్పురించిన ఆలోచనలతో స్వయంగా అరుణాచల శిఖర చిత్రాన్ని చిత్రించారు.
అది అక్కడ ఉన్న దానితో సరిపోవడం నిజంగా ఆయన ధ్యానశక్తిని తెలుపుతుంది.
తిరువన్నమలై చేరిన దాకా ప్రతి నిత్యం స్వామి ఆ చిత్ర దుర్గా మరియు శ్రీ రామ పటాల ముందు ధ్యానంలో కూర్చునే వారు.
బంధువులు ఆయనకు మతి భ్రమించినది అన్న భయంతో ఎన్నో రకాలుగా మార్చడానికి ప్రయత్నించారు.
కానీ పదిమందికి మార్గ దర్శకత్వం వహించ జన్మించిన అవధూత వాటిని పట్టించుకొనక తన కాలమంతా ధ్యానంలో గడిపేవారు.
చివరకు ఆయన తన పద్దెనిమిదో ఏట శ్రీ బాలాజీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించారు.
కాంచీపురం నుండి బయలుదేరి ఆయన, భగవంతుడు ముందుగా నిర్ణయించిన గమ్యం తిరువన్నామలై చేరుకొన్నారు.
అరుణాచల ఆలయంలో, దాపులలో ఉన్న మిగిలిన ఆలయాలలో ధ్యానం చేస్తూ రోజులు గడిపేవారు.
ఎక్కువగా దుర్గా దేవి ఆలయంలో ఉండే వారు.
నిద్రపోయినది, ఆహరం తీసుకొన్నది చూసిన వారు లేరు.
దేహం పైన వ్యామోహం లేక, సరియిన వస్త్ర ధారణ లేకుండా నిరంతరం నవ్వుతూ ఒక తన్మయావస్తలో ఉండే స్వామి తొందరలోనే ఎందరినో ఆకర్షించారు.
వారు జన్మించినది అందు కొరకేగా !
నాటి నుండి స్వామి భూమి మీద నడయాడిన చివరి రోజు వరకు తిరువన్నామలై వదిలి వెళ్ళలేదు.
ఆయనది బంగారు హస్తమని అర్ధం చేసుకొన్నవ్యాపారులు ఎప్పుడు తమ దుకాణాల లోనికి స్వామి వచ్చి వస్తువులను చిందర వందర చేస్తారని ఎదురుచూసే వారు.
మర్మగర్భమైన వ్యాఖ్యలతో, అవసరమైననప్పుడు తన మహిమలతో దరి చేరిన భక్తులకు భోధనలను చేసేవారు.
కస్తాలలో, ఆర్ధిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని తన శక్తులతో దరిచేర్చి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచేలా చేసేవారు.
అలా 1889 ప్రాంతాలలో తిరువన్నమలలై చేరిన శేషాద్రి స్వామి 1929వ సంవత్సరం జనవరి నాలుగో తేదీన సిద్ది పొందారు.
ప్రధాన ఆలయానికి వెలుపల నైరుతిలో చెంగం రోడ్ లో ఉన్న ఆశ్రమంలో స్వామి వారి సమాధి ని దర్శించు కొనవచ్చును.
స్వామి శివైక్యం పొందినా నేటికీ ఎందరో శిష్యుల ఇహలోక భాధలను తీరుస్తూ, నమ్మినవారి వెంటే ఉంటున్నారన్నది లక్షలాది భక్తుల నమ్మకం.
ఆశ్రమంలో తిరువన్నామలై వచ్చే భక్తులు బస చేయడానికి ( ముందుగా తెలియచెప్పాలి)ఏర్పాట్లు ఉన్నాయి.
స్వామి వారి తరువాత మాతా శ్రీ ఉమాదేవి 2004 వ సంవత్సరం దాకా స్వామి వారు స్థాపించిన ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపించారు. శ్రీ మాత కూడా గొప్ప తపస్సంప్పన్నురాలు.
ఆశ్రమంలో ప్రతి రోజు ఆధ్యాత్మిక మనోల్లాసభరిత ప్రశాంత వాతావరణం నెలకొని వుంటుంది.
ఎన్నో పూజలు ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి.
స్వామి వారి గున్రించిన వారి భోధనల సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లబిస్తాయి.
నిత్య జీవితం లో అను నిత్యం ఎదుర్కొనే సమస్యల నుండి దూరంగా సంవత్సరానికి కొన్ని రోజులైనా ప్రశాంత చిత్తంతో భగవంతుని సేవించుకోనాలనుకొనే వారు తప్పక చేర వలసిన క్షేత్రం ఇది.
ఈ ఆశ్రమం శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి పక్కనే ఉంటుంది.
తిరువన్నమలై బస్సు స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి