31, డిసెంబర్ 2017, ఆదివారం

Bhagavan Sri Ramana maharshi satsangam, Ongole

           భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్సంగము, ఒంగోలుభగవాన్ శ్రీ రమణ మహర్షుల 138 వ జయంతి (30. 2. 7) సందర్బంగా ప్రపంచమంతటా ఉన్న ఆయన భక్తులు వివిధ రకాల సేవా, సత్సంగాలలో పాల్గొన్నారు. నా పూర్వ జన్మ సుకృతాన, ఒంగోలు శ్రీ రమణ మహర్షి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన సత్సంగంలో పాల్గొనే అవకాశం లభించినది. గౌరవనీయులు, పెద్దలు అయిన శ్రీ కొప్పోలు హనుమంతరావు, శ్రీ నీలంరాజు పార్ధసారధి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ ప్రసాదరావు గార్లతో పాటు ఎందరో పెద్దల ఆశీర్వాదం అందుకొనే అదృష్టం దక్కినది. 
ఇదంతా శ్రీ అరుణాచలేశ్వరుని మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షుల కరుణాకటాక్షాలతోనే సాధ్యపడినది. 

ఈ కార్యక్రమానికి వెళ్లేలా నన్ను ప్రోత్సహించిన శ్రీ రావినూతల శ్రీరాములు (ప్రఖ్యాత రచయిత)గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.


ఆ  మధుర క్షణాలను అందరితో పంచుకోవాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను.

 కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. 

ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః !!!!


29, డిసెంబర్ 2017, శుక్రవారం

Bhairava Kona

                                            భైరవకోన 

మన రాష్ట్రంలో ఉన్న నల్లమల అడవులు అపురూప వనమూలికలకే కాదు, అరుదైన మరియు అంతరించిపోయే వన్యప్రాణులకు నివాసాలు. అంతే కాదు కొన్ని శతాబ్దాల నుండి ఎందరో ముముక్షువులకు నివాసాలుగా పేరొందాయి. 
యోగులు, సిద్దులు, కాపాలికులు, మునులు ఇక్కడ తపస్సు చేసుకున్నారన్న దానికి తగిన నిదర్శనాలు కనపడతాయి. 
ఇవన్నీ ఒక ఎత్తైతే అత్యంత పురాతనమైన ఎన్నో ఆలయాలు ఈ అడవులలో ఉన్నాయి. 
గుండ్ల బ్రహ్మశ్వరం, నెమలి గుండ్ల రంగనాయక స్వామి, అహోబిలం, మద్దిలేటి స్వామి, ఓంకారం ఇలా ఎన్నో ఉన్నాయి. 
వాటికీ భిన్నమైనది భైరవకోన. చిక్కని అరణ్యం మధ్యలో నెలకొని ఉన్న ఎనిమిది  గుహాలయాలే భైరవకోన. 
ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబవరం కొత్తపల్లి కి సమీపంలోని చంద్రశేఖర పురం (సి యస్ పురం) దగ్గరలో ఉంటుందీ భైరవ కోన. సి యస్ పురం దాకా బస్సులు ఉంటాయి. అక్కడ నుండి సొంత ఆటోలలో చేరుకోవచ్చును. సొంత వాహనం అయితే గుహల దాకా నేరుగా వెళ్లేందుకు వీలుంది. అయిదు కిలోమీటర్లు.
ఈ క్షేత్రానికి పాలకుడు భైరవుడు. అనేక స్థానిక గాధలు వ్యాప్తిలో ఉన్నాయి ఈ గుహల గురించి. కానీ నిర్మాణ శైలి ప్రకారం చూస్తే ఇవన్నీ పల్లవుల కాలం (ఆరు నుండి ఎనిమిదో శతాబ్దాల మధ్య)
ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మహాబలిపురం లాంటి నిర్మాణాలను  పల్లవులే నిర్మించారు.


శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగిరికేశ్వర, భార్గేశ్వర, మల్లిఖార్జున, రామలింగేశ్వర, పక్ష మాలిక లింగ మొత్తం ఎనిమిది గుహాలయాలు. వీటిల్లో ఒకటి ఉత్తర ముఖంగా ఉండగా మిగిలినవి తూర్పు ముఖంగా ఉంటాయి. పైన శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం నూతనంగా నిర్మించారు.
గుహే గర్భాలయం. మొదటి గుహకి ఉన్న ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకొంటాయి.
ఎనిమిదో గుహాలయానికి వెలుపల ఒక పక్క శ్రీ బ్రహ్మ దేవుడు మరో పక్క శ్రీ మహావిష్ణువు రూపాలు చెక్కారు.
పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు వెలుపల ఉన్న చిన్న నీటి గుండంలో పడి, పరావర్తనం చెంది అమ్మవారిని తాకుతాయి. అద్భుతమైన ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ఎందరో భక్తులు తరలి వస్తారు.

 

క్రింది భాగంలో త్రిముఖ దుర్గాదేవి కొలువై ఉంటారు. మూడు ముఖాలలో ఒక ముఖం చిత్రంగా ఉంటుంది.
గుహాలయాలకు చేరుకొనే ముందు పైనించిపడే జలపాతం ఆకట్టుకొంటుంది. కాకపోతే వానా కాలంలోనే జల ప్రవాహం కనపడుతుంది. క్రింద నిలువచేసిన నీటిలో భక్తులు స్నానం చేస్తారు. పక్కనే నిత్యాన్నదాన మండపం ఉంటుంది. శ్రీ కాశీ నాయన ద్వారా వెలుగు లోనికి వచ్చిన భైరవ కోన లో అన్నదానం కూడా ఆయన భక్తుల చలవే !
చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి పరిసరాలు హృదయాలను పరవశింపచేస్తాయి.


ఏమిదవ గుహ 
వాహనాలను నిలిపే చోట పెద్ద హనుమంతుడు ఆశీర్వదిస్తూ ఆహ్వానం పలుకుతుంటారు. 
ప్రకృతిని పరమేశ్వరుని ప్రేమించేవారు తప్పక దర్శించవలన క్షేత్రం భైరవకోన. 

నమః శివాయ !!!!


Bhagavan Sri Ramana Maharshiఈ రోజు భగవాన్ శ్రీ రమణ మహర్షి జన్మదినం. 
ఆయన చల్లని చూపు మరియు ఆశీర్వాదం అందరికీ అందాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను. 
కార్తీక పౌర్ణమి నాటి అరుణ దీపం తాలూకు చిత్రాలను కూడా అందిస్తున్నాను. 

ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!!


శ్రీ రమణుల సమాధి 
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః !!!!

Arunachala Yogulu

                  అరుణాచల యోగులు పుస్తకావిష్కరణ   నా పూర్వజన్మ సుకృతాన మా పెద్దలు చేసిన పుణ్యాన 30.11. 2018 న గుంటూరు అరండల్ పేట శ...