Sri Lakshmi Narasimha Swamy Temple, Guntur

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, గుంటూరు సర్వ లోక రక్షకునిగా పేర్కొనే శ్రీ మన్నారాయణుని దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు సంకల్ప మాత్రాన అవతరించినవి.జననీజనకులు లేకుండా జన్మించిన "సద్యోజాత రూపాలు". వీటిల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ నారసింహ అవతారం.దుష్ట సంహరునిగా, భక్త వరదునిగా, అపమృత్యు భయాన్ని తొలిగించేవానిగా, కోరిన కోర్కెలు కురిపించే కల్పతరువుగా స్వామి ప్రసిద్దుడు. శ్రీ నరసింహునికి మన రాష్ట్రంలో పెక్కు ప్రసిద్ద ఆలయాలున్నాయి. కానీ హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఉగ్రత్వం చల్లారని స్వామి గర్జనలు చేస్తూ లోకాలను భయభ్రాంతులను చేస్తూ తిరగసాగారట. ఆ క్రమంలో స్వామి అనేక మంది రాక్షసులను సంహరించారని, ఆయా ప్రదేశాలలో కొలువైనారని గాధలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు రచించిన "శ్రీ నరసింహ ప్రాచీన గాథా లహరి" ప్రకారం శ్రీవారు ఇలా కొలువైన క్షేత్రాలు మన రాష్ట్రంలో ముప్పై రెండు. చివరకు ప్రహ్లాదుడు చేసిన విన్నపాలకు శాంతించి విశాఖపట్టణానికి సమీపంలో సముద్ర తీరాన ఉన్న భీమ...