Edi Sangathi
వాతావరణం ఎండా వానల మిశ్రమంతో కొంత ఉక్క పోతతో కొంత వేడిగా ఉన్నది. పార్కులో ఒక పెద్ద చెట్టు క్రింద ఇద్దరు యువకులు కూర్చొని ఉన్నారు. ఇద్దరి మొహాల్లో గంభీరత కనపడుతోంది. " ఏమైనా మనం విడిపోవడం మంచిదన్నా!" నెల చూపులు చూస్తూ అన్నాడు యెర్ర చొక్కా వేసుకొన్న అతను. " అదే ఎందుకు అని అడుగుతున్నాను " ఆకూ పచ్చ చొక్కా వేసుకొన్న అతును అడిగాడు. "ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉవ్న్నాము ఏం సాధించాము ?" ఏం సాధించలేదు ? మంచి చదువు, పెద్ద ఉద్యోగం, చక్కని కుటుంబం, సొంత ఇల్లు, సుఖంగా సాగిపోతున్న జీవితం. మనిషన్నవాడికి ఇంత కన్నా ఏం కావాలి?" విడమరిచి చెప్పాడు. " నేను నీ సంగతి మాట్లాడటం లేదు. నా విషయం చెబుతున్నాను " " మనలో మనకి నీ నా ఏమిటి ?" " అలానే అంటావు. నీకు నాకన్నా ఎక్కువ చదువు కొన్నావు. నీ ఉద్యోగం పెద్దది. వదిన కూడా మంచి ఉద్యోగం చేస్తోంది. ఇల్లు కట్టింది కూడా నువ్వే ! నీ కిద్దరూ మగ పిల్లాలే! " నిష్టూరం తొంగి చూసింది మాటల్లో. " దానికి మనం ఏం చేస్తాం తమ్ముడు. అలా కలిసి వచ్చినది అంతే. కానీ నిన్ను ఏ నాడైనా తక్కువగా చూసానా ?" ఆప్యా...