30, సెప్టెంబర్ 2013, సోమవారం

Tiruvannamalai

                                          శ్రీ అరుణాచలేశ్వర 

పంచ భూత క్షేత్రాలలో ఒకటి తిరువన్నామలై. 
సదా శివుడు పంచ భూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశాలకు అధిపతిగా అయిదు క్షేత్రాలలో లింగ రూపంలో కొలువై ఉన్నారు. 
అవి కాంచీపురం ( పృథ్వి ), జంబుకేశ్వరం ( నీరు), శ్రీ కాళహస్తి ( వాయువు), చిదంబరం ( ఆకాశం) కాగా తిరువన్నామలై లో ఉన్నది అగ్ని లింగం. 
స్వామి వారిని శ్రీ అరునాచలేశ్వరుడు అని పిలుస్తారు. 
అన్నామలై పర్వత పాదాల వద్ద ఉన్న ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు.
ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ వట్టి కాళ్ళతో ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధిస్తారు. ఈ ప్రదక్షిణ  14 కి.మీ. ఉంటుంది. ప్రతి ఏడాది, తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర పౌర్ణమి రాత్రి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తారు.








ఈ ఆలయాన్ని చోళ రాజులు తొమ్మిది, పది శతాబ్దాల మద్య కాలంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. 
పెద్ద కోట లాగా ఉండే ఈ దేవాలయం ఉన్నత శిల్పాలను ప్రదర్శిస్తున్నది. 































ఈ ఆలయ సముదాయంలో ఎన్నో ఆలయాలున్నాయి. 
ప్రతినిత్యం వేల సంఖ్యలో దేశం నలుమూలల నుండే గాక విదేశాల నుండి కూడా వస్తుంటారు. 
తిరువన్నామలై ఎందరికో భక్తి వేదాంత మార్గాన్ని చూపించిన క్షేత్రం. 
వారిలో ముఖ్యులు 
శ్రీ శేషాద్రి స్వామి 

శ్రీ రమణ మహర్షి 
వీరే కాదు ఎందరో సాధువులు, సత్యాన్వేషకులు, సాధకులు, యోగులు నేటికి తిరువన్నామలైని తమకు సరియైన గమ్యంగా భావించుతారు. 
చెన్నైకి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరువన్నామలై. 



ఓం అరుణా చల శివ అరుణా చల శివ అరుణాచలా !!! 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...