6, అక్టోబర్ 2013, ఆదివారం

Edi Sangathi

వాతావరణం ఎండా వానల మిశ్రమంతో కొంత ఉక్క పోతతో కొంత వేడిగా ఉన్నది.
పార్కులో ఒక పెద్ద చెట్టు క్రింద ఇద్దరు యువకులు కూర్చొని ఉన్నారు.
ఇద్దరి మొహాల్లో గంభీరత కనపడుతోంది.
" ఏమైనా మనం విడిపోవడం మంచిదన్నా!" నెల చూపులు చూస్తూ అన్నాడు యెర్ర చొక్కా వేసుకొన్న అతను.
" అదే ఎందుకు అని అడుగుతున్నాను " ఆకూ పచ్చ చొక్కా వేసుకొన్న అతును అడిగాడు.
"ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉవ్న్నాము ఏం సాధించాము ?"
ఏం సాధించలేదు ? మంచి చదువు, పెద్ద ఉద్యోగం, చక్కని కుటుంబం, సొంత ఇల్లు, సుఖంగా సాగిపోతున్న జీవితం. మనిషన్నవాడికి ఇంత కన్నా ఏం కావాలి?" విడమరిచి చెప్పాడు.
" నేను నీ  సంగతి మాట్లాడటం లేదు. నా విషయం చెబుతున్నాను "
" మనలో మనకి నీ నా ఏమిటి ?"
" అలానే అంటావు. నీకు నాకన్నా ఎక్కువ చదువు కొన్నావు. నీ ఉద్యోగం పెద్దది. వదిన కూడా మంచి ఉద్యోగం చేస్తోంది. ఇల్లు కట్టింది కూడా నువ్వే ! నీ కిద్దరూ మగ పిల్లాలే! " నిష్టూరం తొంగి చూసింది మాటల్లో.
" దానికి మనం ఏం చేస్తాం తమ్ముడు. అలా కలిసి వచ్చినది అంతే. కానీ నిన్ను ఏ నాడైనా తక్కువగా చూసానా ?"
ఆప్యాయంగా అడిగాడు.
"ఎక్కువ తక్కువల విషయం కాదిక్కడ. నాకే చిన్న తనంగా ఉన్నది. "మనసులోని మాట బయట పెట్టాడు.
" చిన్నతనం ఎందుకు ? మనింట్లో ఎవరైనా నిన్ను కించ పరచేలా మాట్లాడారా ? నేను కాని మీ వదిన కాని ఇదంతా మాది అని అహం చూపామా ? అన్ని విషయాలలో నిన్నుసంప్రదిస్తూనే ఉన్నాముగా !" వివరించే ప్రయత్నం చేసాడు అన్న.
బదులు చెప్పలేదు తమ్ముడు.
నెల చూపులు చూస్తూ కూర్చున్నాడు.
" ఇన్నేళ్ళలో నీపట్ల మేము అగౌరవంగా ప్రవర్తిన్చామా ?" రెట్టించాడు అన్న.
" అవన్నీ ఇప్పుడెందుకు ? కలిసి మాత్రం ఉండలేము అంతే !" మొండిగా చెప్పేసాడు.
ఏం చెయ్యాలో తెలియలేదు అన్నకు.
బెంచి మేదానుంచి లేచి అటు ఇటు నడవడం మొదలుపెట్టాడు.
దూరంగా కూర్చొని వీరినే గమనిస్తున్న ఒకతను లేచి వచ్చాడు.
" మీ స్వంత విషయాలలో కలుగచేసుకొంటున్నాను అని అనుకోకపొతే మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి. " అని అడిగాడు.
"నువ్వెవరు స్వామీ ? నీకేంటి సంభంధం ?" దురుసుగా అన్నాడు తమ్ముడు.
"నువ్వు ఊరుకో !" అంటూ అతనిని ఆపి " రండి. మీరెవరో పెద్ద మనిషి లాగా ఉన్నారు. చక్కని నిండు కుటుంబం నుండి విడి పోతానంటూన్నాడు నా తమ్ముడు. మీరు కొద్దిగా నచ్చ చెప్పండి." రిక్వెస్ట్ చేసాడు అన్న
"క్షమించాలి. మీ సంభాషణ కొంత విన్నాను. చాలా మటుకు అర్ధం అయ్యింది. నీ సమస్య ఏమిటి తమ్ముడూ ?"
"ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నా నా జీవితోలో పెద్దగా డెవలప్మెంట్ లేదు. విడి పోతే అన్నా బాగుంటుంది అని అనుకొంటున్నాను." ముభావంగా చెప్పాడు.
" కలిసి ఉండగా లేని డెవలప్మెంట్ విడిపోతే ఎలా సాధిస్తావు?"
" నాది అన్నది ఏర్పడితే responsibility పెరుగుతుంది. అప్పుడు పక్క planతో డెవలప్ అవుతాను"
 గర్వంగా చెప్పాడు.
" కలిసి ఉండి అదే planతో అందరి helpతో ఇంకా develop అవ్వాచ్చు కదా !"
"కుదరదు. దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. "
" అవి ఏమిటో చెబితే మాట్లాడుకొని solve చేసుకోవచ్చును కదా !"
" అనుకొన్నంత తేలిక కాదులెండి. అయినా కలిసి ఉండటం నా అత్తా మామ, నా భార్య పిల్లలకు, బావమరుడులకు, వారి భందువులకు ఇష్టం లేదు. వీరంతా నాకు కావలసిన వారు.  నా అభివృద్దిని కోరుకొనే వారు. వారి మాట కాదనలేను. ఇష్టం లేకుండా కలిసి ఉండటం వలన ఏమిటి ప్రయోజనం? తెలియక అడుగుతున్నాను. చెప్పండి."
" వారి సంగతి సరే ! అమ్మానాన్నా, అన్నా వదిన వీళ్ళ సంగతి ఏమిటి ?"
" వీళ్ళతో ఉండే నేను ఇలా ఉన్నాను అన్నది వారి అభిప్రాయం. నాది కూడా !" విషయాన్ని తేల్చేసాడు.
పెద్ద మనిషి అన్న వంక " ఏం చేద్దాం ?" అన్నట్లుగా చూసాడు.
" సరే తమ్ముడూ ! నీమాట ప్రకారమే విడిపోదాం. "అన్నాడు అన్న.
తమ్ముడి మోహంలో ఆనందం తొగి చూసింది.
"Thanks అన్నా!" అన్నాడు
"ఒక understandingతో విడిపోయినా జీవితకాలం ఇద్దరూ ఆప్యాయనురాగాలతో సుఖంగా జీవించండి." మనస్పూర్తిగా దీవించాడు పెద్ద మనిషి.
" ఒక్క నిముషం ఆగి ఆ understanding కూడా తమరే తేల్చేసి వెళ్ళండి."
" ఆస్తులా !" ప్రశ్నించాడు అతను.
" మాకు పెద్దగా ఆస్తులు లేవండి. ఉన్నది ఒక్క ఇల్లే ! ఎప్పుడో చవకగా వస్తోందని మా నాన్న గారు కొన్న స్థలంలో
నేను loan తీసుకొని ఇల్లు కట్టించాను." చెప్పాడు అన్న.
" ఆ ఇల్లు నాకోదిలేయ్యమని చెప్పండి. కావాలంటే కొంత డబ్బు ఇస్తాను." బాంబ్ పేల్చాడు.
" కష్టపడి నేను కట్టించుకొన్న ఇల్లు నీకోది లేయ్యడం ఏమిటి? నాన్న కొన్న స్థలంలో నీకు భాగం ఉంటుంది కాబట్టి నీకు కొంత డబ్బు నేను ఇస్తాను." అడ్డం తిరిగాడు అన్న.
" చూసారా! కట్టు బట్టలతో నన్ను ఇంట్లోంచి వెల్లగోడటానికి చూస్తున్నాడు. బుద్ది బయట పడింది."నిందారోపణ చేసాడు తమ్ముడు.
పెద్దమనిషికి shock తగిలినట్లుగా ఐపోయాడు.
" అదేమిటి అలా అంటావు. కలిసి ఉండు లేదా ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళు. " అన్నాడు తేరుకొని.
" అంటే నేను బాగు పడటం మీకు ఇష్టంలేదు. అందుకే నాకు అన్యాయం చేస్తున్నారు. ఆయన, ఆయన పెళ్ళాం ఇద్దరూ ఉద్యోగస్తులే! ఖర్ఛు తక్కువ సంపాదన ఎక్కువ. అదీకాక ఆయనకు రెండో మూడో స్థలాలున్నాయి. క్షణాలలో ఇల్లు కట్టుకోగలదు. ఈ ఇల్లు నాకు రావడమే న్యాయం." యాగీ మొదలుపెట్టాడు.
" అంటే నీ అన్న కట్టించుకొన్న ఇంటిలో ఆయనకు హక్కు లేదా?"
" తానొక్కడే కట్టించాడ ఏమిటి? ఉమ్మడి ఆస్తి ఐన స్థలాన్ని నేను ఒప్పుకొని ఇవ్వబట్టే కదా ఇల్లు కట్టకలిగింది. ఇల్లు కడుతున్నప్పుడు నేను కూడా చాల కష్టపడ్డాను. నా కష్టానికి విలువలేదా ? "
" ఇంత  కాలం అద్దేలేకుండా ఉన్నాడుగా ! ఉమ్మడి ఆస్తి కాబట్టి నేనే కొంత డబ్బు ఇస్తాను. అయినా నాన్న గారి భాగం ఉందిగా ! " కోపంగా అన్నాడు అన్న.
" అయితే అమ్మానాన్నలను నేనే చూసుకొంటా ఇల్లు నాకు వదిలెయ్యి. " కొత్త లాజిక్ పట్టుకొన్నాడు.
" ఇప్పటికిప్పుడు నా ఇల్లు, అమ్మానాన్నలను నీకు వదిలేసి నేను వెళ్ళిపోవాలా ? "
" నిన్ను వెంటనే వెల్లమనడం లేదు. ఇల్లు కట్టుకొని వెళ్ళు. అప్పటిదాకా ఉండచ్చు. నేను అంత దుర్మార్గుడను కాదు'
" నీ దయ ధర్మం, డబ్బు నాకొద్దు. నీవాట కింద వచ్చే డబ్బుకు బదులు నేను నీకొక స్థలం ఇస్తా. అక్కడ ఇల్లు కట్టుకో." కోపం కట్టలు తెన్చుకోసాగింది అన్నలో.
" ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు, అన్ని విధాలుగా కలిసి వచ్చిన ఇల్లు, చక్కటి నీటి వసతి, అన్నిటికి సెంటర్లో ఉన్న ఇల్లు, వాస్తు రీత్యా అద్భుతంగా ఉన్న ఇల్లు. దీన్ని వదిలేసి ఊరి చివర నువ్వు ఇచ్చే స్థలం లో ఇల్లు కట్టుకొని ఉండాలా ! నా వాళ్ళ కాదు. నిన్నందరు సమర్ధుడు, తెలివికలవాడు అంటారుగా. నువ్వే వెళ్ళు ఊరి చివరికి        
అంతే !"
పెద్ద మనిషి రాయి లాగా నిలబడి వారి వాదన వింటున్నాడు.
అన్నదమ్ములు ఆయనను పట్టించుకోవడం లేదు.
" పెద్దలతో పంచాయితీ పెట్టిస్తా"
" కోర్టుకు వెళతా "
" చచ్చి అయినా ఇంటిని దక్కిన్చుకొంటా"
" చచ్చినా ఇంటిని ఇవ్వను"
" చెడు మాటలు విని ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు "
" నీ స్వార్ధానికి నన్ను వాడుకోవాలని చూస్తున్నావు "
వాదనలు ఘర్షణ లోనికి దిగబోతుండడంతో పెద్ద మనిషి ఇద్దరి మధ్యకు వచ్చి " తమ్ముళ్ళూ! నా మాట వినండి. అనవసర అపోహలతో విదిపోకండి. హాయిగా కలిసి వుండండి. పైకి రండి. మనస్సును, ఆలోచనలను శుబ్రం చేసుకోండి. అది మీకు అన్ని విధాలుగా లాభిస్తుంది. లేక పోతే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చ్చినట్లుగా అవుతుంది. అది ఇద్దరికీ నష్టం."
" ఈ స్వార్ధపరుడితో ఇంకా కలిసి ఉండేది లేదు. " ఆగ్రహంగా అరిచాడు తమ్ముడు.
"నా  ఇల్లు  నాకు ముఖ్యం " స్థిరంగా పలికాడు అన్న.
పెద్ద మనిషి ఇద్దరి వంకా నిరసనగా చూసి చేతులు జోడించి ఆకాశం వంక చూస్తూ గబ గబా వెళ్లి పోయాడు.
అన్నదమ్ముల వాదన కొనసాగుతూనే ఉన్నది. 

"




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...