Gaja Gamanam
గజ "గమనం" ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు ........ చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకొని మనందరం పాడుకొన్న పాట ఇది. మనమే కాదు మన ముందు తరాలవారు మన తరువాత తరాల వారు పాడుకొన్నారు. పాడుకొంటారు కూడా. ఒకప్పుడు ఏ సర్కస్ కంపెనీ లేదా భైరాగులో, సాధువులో ఊరిలోకి వస్తే పిల్లలకు ఆటవిడుపే. ఏదో వంకతో అక్కడికి వెళ్లి ఏనుగులను చూస్తుండి పోయేవారు. నేటికీ పరిస్థితులలో మార్పు లేదు. పది అడుగుల ఎత్తుతో బలమైన శరీరంతో, తోక, చెవులు, తొండాన్ని గమ్మత్తుగా కదిలిస్త...