Marundeeshwara Temple, Thirukachur

సర్వరోగాలకు మందు ఈ మహేశ్వరుడు సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపం లోని తిరుకచూర్ క్షేత్రం లోని మరో విశేష దేవాలయం శ్రీ మరుండేశ్వర స్వామి వారు కొలువైనది. ఈ ఆలయం ఉన్న రుద్రగిరి గతంలో అనేక మంది తాపసులకు నిలయంగా పేరొందినది అని పురాతన తమిళ గ్రంధాలు పేర్కొన్నాయి అని తెలుస్తోంది. ఎన్నో ఋష్యాశ్రమాలు ఇక్కడ ఉండేవట. ఎంతో పవిత్ర ప్రదేశంగా ఋషులు భావించిన ఈ క్షేత్ర గాధ దక్ష యజ్ఞం తో ముడి పడినట్లుగా తెలుపుతోంది. పిలవని పేరంటానికి పతిదేవుని మాట దాటి వెళ్లిన దాక్షయాణి అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ గుండలో దూకి ఆత్మాహుతి చేసుకొన్న విషయం మనందరకూ తెలిసినదే ! ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రాది గుణాల ద్వారా దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విరాగిగా సంచరించసాగారట. ఆయనను తిరిగి మామూలు స్థితికి తీసుకొని రమ్మని ముల్లోకవాసులు శ్రీమహావిష్ణువును ప్రార్ధించారట. అప్పుడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా విభజించారట. అలా చక్రాయుధ వేగానికి సతీదేవి శరీరభాగాలు పుడమి మీద పలు చోట్ల పడినాయి....