పోస్ట్‌లు

Elephant race at Guruvayur

   ఆహ్లాదం  మరియు  ఆధ్యాత్మికతల కలయిక అనేయోట్టం                                                                                                భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలోని ఆలయాలలో ఏనుగు ఉండటం ఒక తప్పనిసరి ఆనవాయితీ. అన్ని ప్రముఖ దేవాలయాలు నియమంగా  గజ సేవ నిర్వహించడం కూడా ఒక సంప్రదాయంగా నెలకొని ఉన్నది. ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు ధరించి,పుష్పాలతో తీర్చిదిద్దిన   అంబారీతో సుందరంగా అలంకరించిన ఏనుగు మీద నయనమనోహరంగా ముస్తాబు చేసిన ఉత్సవ మూర్తులను ఉపస్థితులను చేసి మాడ  లేదా నగరవీధులలో ఊరేగించడం అనాదిగా వస్తున్న ఒక సేవ లేదా సాంప్రదాయం.  గజాలు చాలా తెలివిగలిగిన జంతువులు. సూక్ష్మ గ్రాహులు. నేర్పించే వాటిని సులభంగా గ్రహించగలవు. వాటి పెద్ద శరీరం, తల, చెవులు, దంతాలు, తొండం మ...

Sri Jagannatha Mandir, Koraput

                                          శబర శ్రీ క్షేత్రం   శ్రీ జగన్నాథ స్వామి ఒరియా ప్రజలకు ప్రధమ ఆరాధ్య దైవం. సుందర సాగర తీరాన యుగాల క్రిందట అగ్రజుడైన శ్రీ బలదేవునితో మరియు సోదరి అయిన శ్రీ సుభద్ర దేవితో కలిసి  కొలువైన శ్రీ జగన్నాధుని స్మరణం, వీక్షణం ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా విశ్వసిస్తారు ఒడిసా వాసులు. హిందువులకు ముఖ్యమైన దర్శనీయ నాలుగు క్షేతాలలో ఒకటి అయిన పూరి శ్రీ జగన్నాథుని స్వగృహం.  దేశంలో పేరొందిన ఆలయాలతో పోలిస్తే పూరి క్షేత్రంలో జరిగే పూజలు, అలంకరణలు, యాత్రలు మరియు ఆరగింపులు చాలా ప్రత్యేకంగా ఉండటం పేర్కొనవలసిన అంశం. కాలక్రమంలో తొలుత ఏర్పడిన పూరి ఆలయ తరహాలో అనేక ప్రాంతాలలో అదే శైలిలో ఆలయాలను స్థానిక భక్తులు నిర్మించుకున్నారు. ఒక్క ఒడిసా రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఏర్పడినాయి. శ్రీ జగన్నాథ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యింది. ఇలా ఇతర ప్రాంతాలలో శ్రీ జగన్నాథ మందిరాలు ఏర్పడటానికి మూలం తొలుత శ్రీ జగన్నాథుని ఆరాధించిన శబరులే కావడం విశే...

Nava Kailasam's Thirunelveli

                          నవగ్రహ క్షేత్రాలు - నవ కైలాసాలు                                                                                                          కైలాసనాధుడు ఇలలో పెక్కు క్షేత్రాలలో స్వయంభూలింగ రూపంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయాలన్నీ భక్తులకు భువిలో కైలాస సమానంగాను,దర్శనీయ క్షేత్రాలుగా ప్రసిద్దమయ్యాయి.  కానీ ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని దక్షిణ భాగాన ఉన్న తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలను సస్యశ్యామలం చేసే నది తమిరపారాణి. ఆ నదీతీరంలో ఉన్న నవ కైలాస క్షేత్రాలు మిగిలిన వాటికి భిన్నమైనవి.   పురాణ గాధలలో పేర్కొన్న ప్రకారం నవ కైలాసాలు ముక్తి ప్రసాదాలు.  శివ పార్వతుల కళ్యాణం వీక్షించడానికి ముల్లోకాల...

Kanaka Dhara Sthothram

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్! అంగీకృతాఖిల విభూతి రసంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !! 2. ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని ! మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !! 3. విశ్వా మరేంద్ర పదవి భ్రమ దానదక్షమానంద హేతు రదికం మురవిద్విషోపి. ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !! 4.అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం! అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !! 5. బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి ! కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !! 6. కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ! మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !! 7. ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!! ...

pancha kosha yatra

                         పుణ్య ప్రదం పంచ కోశి యాత్ర భగవదనుగ్రహం కొరకు భక్తులు ఎన్నో తీర్థ పుణ్య క్షేత్రాల యాత్రలు చేస్తుంటారు. చార్ ధామ్ యాత్ర, కాశీ యాత్ర, కైలాస మానససరోవర యాత్ర, అమరనాథ్ యాత్ర, దక్షిణ దేశ యాత్ర ఇలా చాలా ! వీటన్నింటిలో ముఖ్యమైన సంకల్పం ఆయా ప్రాంతాలలో దేవాలయాలలో వివిధ రూపాలలో కొలువైన భగవంతుని సందర్శనం. కానీ దీనికి భిన్నమైన యాత్ర ఒకటి ఉన్నది. అదే పంచ కోశ యాత్ర. దీనినే పంచ క్రోష యాత్ర అని కూడా అంటారు. అనగా నిర్ణీత వ్యవధిలో (ఒక రోజు నుండి అయిదు రోజుల లోపల) నిర్ణయించబడిన అయిదు ఆలయాలను దర్శించుకోవాలి. యాత్ర చేయాలి అనుకొన్న రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదులు చేసి బయలుదేరాలి. రోజంతా ఉపవాసం ఉండాలి(ఒక రోజు అయితే).ద్రవ పదార్ధాలను తీసుకోవచ్చును.యాత్రను కాలినడకన (చెప్పులులేకుండా) చేయాలి. పురాణ కాలం నుండి ప్రజలే కాదు పాలకులు కూడా ఈ యాత్ర (పరిక్రమ / ప్రదక్షణ) చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్రేతాయుగంలో దశరధ నందనులు నలుగురూ తమ భార్యలతో కలిసి అయోధ్యతో పాటు...
          పశు పక్ష్యాదులకు కూడా ప్రత్యేక రోజులున్నాయిట                                                                                                   మనందరం ఉన్నంతలో ఆనందంగా, తాహతుకు తగినట్లుగా ఆర్భాటంగా జరుపుకొనేది పుట్టిన రోజు వేడుకలను. మనది లేదా మన కుటుంబ సభ్యుల జన్మదినోత్సవ సందర్బంగా ఒకరికొకరు శుభాకాంక్షలు అందుకోవడం లేదా తెలపడం, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపడం ఆ రోజున  సహజంగా చోటుచేసుకునే పరిణామాలు. అది ఒక ప్రత్యేకమైన రోజు మనందరికీ.  మరి మనతో పాటు ఈ భువిలో నివసించే పశు పక్ష్యాదులు సంగతేమిటి ? వాటికి నోరు లేదాయ పాపం. ఏమి చేయాలి ? ఎక్కడో పుడతాయి. మరెక్కడో మరణిస్తాయి. జీవించడానికి ఎన్నో పాట్లు పడుతుంటాయి.  భావాలను వ్యక్తపరచడానికి మనకంటూ బాష ఉన్నది. మాట్లాడగలం. కానీ మన వలన పర...

Shraddha Narayana Temple, Nenmeli

చిత్రం
              సద్గతులను ప్రసాదించే శ్రాద్ధ నారాయణుడు   ప్రజలు ఆలయాలకు వెళ్లి కొలువు తీరిన దేవీదేవతలకు తమ కోరికల చిట్టా తెలుపుతూ  నెరవేర్చమని అర్ధిస్తుంటారు. వీటిల్లో అధికభాగం ఇహలోక సుఖాలే ఉంటాయి. ఇవి బొందిలో జీవం ఉన్నంత వరకూ ఒకదాని తరువాత మరొకటి చొప్పున కొనసాగుతూనే ఉండటం ఆ అందరికీ తెలిసిన విషయమే !  ఒకోసారి ఈ తాపత్రయం మరణానంతర లేదా మరో జన్మకు సంబంధించిన విషయాల పట్ల కూడా ఉండటం విశేషం. కానీ సమస్త జీవులను క్షమించి  ఆదరించి వారి కోర్కెలను నెరవేరుస్తారు పరాత్పరుడు. ఆ విధమైన అదృష్టానికి నోచుకొన్న ధన్య జీవులైన దంపతుల కారణంగా అందరికీ లభించిన ఒక అరుదైన ఆలయం తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు పట్టణంలోని శ్రీ శ్రాద్ధ నారాయణ పెరుమాళ్ కోవెల.     చాలా చిన్నగా మన వాడకట్టులో కనపడే అతి సాధారణ నిర్మాణంలాగ కనిపించే శ్రీ మహా లక్ష్మి సమేత  శ్రీ నారాయణ పెరుమాళ్ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. గతంలో ఈ క్షేత్రాన్ని "పుండరీక నల్లూరు" లేదా "పిండం వైత్త నల్లూరు" అని పిలిచేవారు. చెంగల్పట్...