పోస్ట్‌లు

Tamirabarani River

చిత్రం
                                                    తమిరబారాణి నది పుష్కరాల సంబరం                                                                                                        లక్షల సంవత్సరాలుగా ఎందరో ఈ భూమిలో జీవించారు.ఎంతో సాధించారు. కొంత పోగొట్టుకున్నారు. కానీ ఎవరు నీరు లేకుండా జీవించలేదు. రానున్న తరాలు కూడా అంతే ! జలం జీవం హిందువులు నీటిని భగవంతుని ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీపరమశివుని ప్రతిరూపాలుగా పరిగణిస్తారు. ప్రసిద్ధి చెందిన పంచ భూత క్షేత్రాలు భక్తులకు సందర్శనీయ క్షేత్రాలు. నీరు అమ్మ కూడా. నదీమతల్లి, గంగమ్మ...

Namah Shivaya

చిత్రం
                                          నమః శివాయ   లోకాలను ఏలే త్రిమూర్తులలో బ్రహ్మ దేవునికి వివిధ కారణాల వలన అతి తక్కువ ఆలయాలున్నాయి. వైకుంఠ వాసుడు లోక క్షేమం కొరకు ధరించిన అవతార స్వరూపాలతో కలిసి అనేక పుణ్య క్షేత్రాలలో కొలువు తీరి ఉన్నారు.  భువిలో అత్యధిక ప్రదేశాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నది కైలాసవాసుడే !ఆయన పరివారంలో భాగం అయిన గణపతి, కుమార స్వామి, పార్వతీ దేవి, వీరభద్రుడు, భైరవుడు ఆదిగా గల వారితో కలుపుకొంటే వేలాది క్షేత్రాలలో వీరంతా కొలువు తీరి భక్తులను కరుణిస్తున్నారు.    ఇవి కాకుండా ఒక విషయం ఆధారంగా అంటే కొలుసు కట్టు ఆలయాలు అధికంగా ఉన్నది కూడా మహేశ్వరునికే ! వీటిల్లో కొన్ని మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం ఆలయాల రాష్ట్రం తమిళనాడులోనే ! ఇవన్నీ కూడా ఆర్తులకు ఆదిదేవుని అనుగ్రహం లభించడానికి ఏర్పాటు చేసినవి. ప్రజలు ప్రతి నిత్యం భగవంతుని ఆరాధిస్తుంటారు. కానీ అన్యధా శరణం  నాస్తి  అంటూ ఆప...

Sri Villiputtur

చిత్రం
                                        శ్రీ విల్లిపుత్తూరు   తమిళనాడులోని ఆలయాల లేదా ఊరి పేర్లు అతి తక్కువగా శ్రీ తో ప్రారంభం అవుతాయి. అలాంటి వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ రంగం, శ్రీ ముషీణం మరియు శ్రీ విల్లిపుత్తూరు. చిత్రమైన విషయం  ఏమిటంటే ఈ మూడు క్షేత్రాలకు సంబంధం ఉండటం. త్రిభువన పాలకుడు, అనంతశయనుడు అయిన శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథస్వామి గా కొలువైన శ్రీరంగం , భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి కెక్కినది. ఆయన ధరించిన అనేకానేక అవతారాలలో ప్రముఖమైన దశావతారాలలో మూడవది అయిన వరాహ అవతార రూపంలో వెలసిన ఏకైక ఆలయం ఉన్న ప్రదేశం శ్రీ ముషిణం. మూడవదైన శ్రీ విల్లిపుత్తూరు, శ్రీ మన్నారాయణ మూర్తి పైన అపురూపమైన పాశురాలను గానం చేసిన పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఇద్దరి స్వస్థలం. వారిలో ఒకరు శ్రీ రంగనాథుని ఆరాధించి ఆయనలో ఐక్యం అయిన ధన్యురాలు "ఆండాళ్ళు". ఈమెనే గోదాదేవి అని పిలుస్తారు. ప్రతి విష్ణు ఆలయంలో ఈమెకు ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈమె రాసిన "తిరుప్పావై" గానం ప్రతి ధనుర్మాసంలో ...

Sri Veerabhadra Swamy Temple, Palanka

చిత్రం
శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, పాలంక                           పావనప్రదం పాలంక సందర్శనం  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో సుమారు అయిదు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి దట్టమైన నల్లమల అడవులు. ఇవి ఆంధ్రా లోని గుంటూరు, కర్నూల్, ప్రకాశం,కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలో మరియు తెలంగాణ లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో కృష్ణా మరియు పెన్నా నదీ తీరాల నడుమ ఉంటాయి. ఎన్నోఎత్తైన కొండలు, లోయలు, మైదాన ప్రాంతాలతో నిండి ఉంటాయి అరణ్యాలు. వీటిల్లో ఎత్తైన పర్వతాలు  గుండ్లకమ్మ నది జన్మస్థలమైన పర్వతంతో పాటు "భైరాని కొండ". వీటి ఎత్తు వెయ్యి మీటర్ల పై మాటే ! ఈ అరణ్యాలలో ఎన్నో రకాల వృక్షాలు మరియు ఔషధాలు లభ్యమవుతాయి. స్థానిక అడవి పుత్రులు తమ జీవనోపాధిని వీటి ద్వారానే పొందుతారట. అరణ్యంలో ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నాయి.  ఈ అడవులలో మూడు వేల కిలోమీటర్ల మేర పెద్ద పులుల రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. ఎన్నో వాగులు, వంకలు, చెరువులు, గుండాలు ఈ అరణ్యాలలో కనిపిస్తాయి...