పోస్ట్‌లు

Greetings

చిత్రం
వెలుగులు చిందే ఈ దీపావళి అందరికీ శుభాలు చేకూర్చాలని, సుఖ శాంతులు అందించాలని, జీవితాలలో సరికొత్త కాంతులు నింపాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. 

Sri Manakula Vinayaka Temple, Puducherry

చిత్రం
                            శ్రీ మనకూల వినాయక ఆలయం   తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది. ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు  చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట  హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.  శ్రీ మ...

Updates 4

కృతజ్ఞతలు.  శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు మరో  స్పందన  వచ్చినది.  చికాగో (USA),నుండి  అజ్ఞాత మిత్రులు  ఒకరు Rs.6626.00 ($.100 dollars)  పంపారు.  ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను ఇప్పటిదాకా వచ్చిన  ధనంతో 500 పుస్తకాలు ముద్రించి కార్తీక మాసంలో మొదట తిరువణ్ణామలై లో పంచాలని భావిస్తున్నాను. కావలసిని సమాచారం అంతా సిద్ధంగా ఉన్నది. ఈ నెల 8న తిరువణ్ణామలై   వెళ్లి మరొక్కమారు శ్రీ అన్నామలై స్వామిని దర్శించుకొని కార్యక్రమం ప్రారంభించాలన్నది సంకల్పం.  దసరా తరువాత పుస్తకం యొక్క ప్రతిని ఈ బ్లాగ్ లో ఉంచాలని ఆశ పడుతున్నాను.  ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం.  నమస్కారాలతో,  ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 

Sri Kanaka Durga Devi Temple, Vijayawada

చిత్రం
                    శ్రీ కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రీ, విజయవాడ    అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని సమస్త భక్తలోకం ఎలుగెత్తి కీర్తించే తల్లి ఇంద్రకీలాద్రి మీద కొలువైన శ్రీ కనక దుర్గమ్మ ! యుగాల క్రిందట భక్తుని కోరిక మేరకు, శిష్టరక్షణార్ధం, దుష్ట శిక్షణార్ధం దుర్గమ్మ వెలసిన విజయవాడ, పక్కన గలగలా పారే కృష్ణమ్మ ఎన్నో పురాణ గాధలను తెలుపుతాయి.   కీలుడనే పర్వత రాజు అమ్మవారి భక్తుడు. జగన్మాత తన హృదయ కుహరంలో కొలువు తీరాలన్నఏకైక కోరికతో తపస్సు చేసాడు. సంతుష్టురాలైన జగదాంబ సాక్షాత్కారం ప్రసాదించి తొందరలోనే కలియుగాంతం వరకు ఇక్కడ నివాసముంటానని  వరము అనుగ్రహించింది. అనంతర కాలంలో లోకకంటకుడైన దుర్గమాసురుని సంహరించిన దేవి ఈ పర్వతం మీద స్వయంవ్యక్తగా ప్రకటితమయ్యారు. అసురుని భాధ తొలగిన ఆనందంతో ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి పవిత్ర కృష్ణవేణిలో స్నానమాచరించి దుర్గంబను సేవించుకొన్నారు. ఈ కారణంగాపర్వతకుని పేరు  ప్రధమ పూజ చేసిన ఇంద్రుని పేరు కలిసి  ఈ శిఖరం "ఇంద్ర కీలాద్రి "గా  జగత్...

Naulakha Mandir, Begusarai

చిత్రం
                                నవలాఖా మందిర్, బెగుసరాయ్   గణపతి ఆలయం, అమ్మవారి గుడి, శివాలయం లేదా శ్రీ కృష్ణాలయం ఇలా నే మనం మనకు తెలిసినా  లేదా సందర్శించిన ఆలయాలను ఉదహరిస్తాము.  కానీ ఆ నిర్మాణానికి అయిన ధనం విలువతో ఆలయాన్ని పిలవడము చేయం. అయితే అలా నిర్మాణానికి పెట్టిన రూపాయల విలువతో పేర్కొనే రెండు ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. ఒకటి ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ లో ఒకటి రెండవది బీహార్ రాష్ట్రం లోని బెగుసరాయ్ లో. ఈ మధ్య ఉద్యోగరీత్యా బీహార్ రాష్ట్రంలో పర్యటించాల్సి వచ్చినప్పుడు బెగుసరాయ్ వెళ్లాను. అక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ మందిరం ఒకటి ఉందని దానిని నవలాఖా మందిర్ అని పిలుస్తారు అని తెలిసింది.పనంతా పూర్తి అయిన తరువాత సాయంత్రం మందిరం చూడటానికి మా స్థానిక సహోద్యోగిని తో కలిసి వెళ్లాను.బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో విష్ణు పూర్ అన్న ప్రాంతంలో ఉన్న ఈ మందిరానికి చేరుకోడానికి ఆటోలు దొరుకుతాయి. 1853వ సంవత్సరంలో సంత్ శ్రీ మహా...