Tiruvannamalai a unique place
అసాధారణ విశేషాల నిలయం - తిరువణ్ణామలై తిరువణ్ణామలై లో అణువణువూ శివ స్వరూపమే! కైలాసనాధుడే కొండ రూపంలో కొలువైన దివ్య క్షేత్రం కదా ! ఈ కారణం గానే మరే పుణ్య క్షేత్రం లోనూ లేని కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా ఎంతో ప్రాముఖ్యం గల పౌరాణిక నేపధ్యం కలిగి ఉంటాయి. ఇక్కడ తప్ప మరెక్కడ పర్వతాన్ని పరమేశ్వరుని క్రింద పూజించరు. శ్రీ కుమార స్వామి ఉద్భవించిన స్థంభం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ప్రియ భక్తుడైన అరుణగిరినాథర్ గానానికి పరవశుడై ప్రత్యక్షమైన క్షేత్రం ఇదొక్కటే ! ప్రాంగణంలో మొదటగా వచ్చే మురుగన్ ఆలయం లోని స్థంభం నుండే స్వామి ఉద్భవించినట్లుగా చెబుతారు. గిరివలయంలో దర్శించుకొని అష్ట దిక్పాల లింగాలు మరియు సూర్య చంద్ర ప్రతిష్ఠిత లింగాలు ఇక్కడే ఒక వరుసలో కనపడతాయి. చాలా చోట్ల దిక్పాలకులు , గ్రహాలూ ప్రతిష్టించి లింగాలు ఉన్నా ఇలా మాత్రం ఉండవు. ముగ్గురు మహర్షుల ( దుర్వాస, గౌతమ మరియు అగస్త్య) ఆరాధనా స్ధలాలు ఒక్క తిరు...