4, డిసెంబర్ 2018, మంగళవారం

Arunachala Yogulu


                  అరుణాచల యోగులు పుస్తకావిష్కరణ నా పూర్వజన్మ సుకృతాన మా పెద్దలు చేసిన పుణ్యాన 30.11. 2018 న గుంటూరు అరండల్ పేట శివాలయంలో నా ద్వితీయ పుస్తకం "అరుణాచల యోగులు" పరమపూజ్య పరివ్రాజక శ్రీ శ్రీ శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య హస్తాల మీదగా ఆవిష్కరించబడినది. శ్రీ స్వామివారికి నా కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు.  
ఆవిష్కార సభకు హాజరైన భక్త జనులకు నా నమస్కారాలు. 
పుస్తక ముద్రణకు ఆర్ధిక సహాయం చేసిన శ్రీ దాసరి ప్రసాద్ గారికి, అన్ని సమయాలలో తోడుగా ఉండే నా ప్రాణ మిత్రుడు శ్రీ ఏక ప్రసాదు కు ఆత్మీయ వందనాలు. 
ఈ పుస్తకావిష్కరణ గురించి తమ పత్రికలలో ప్రచురించిన పాత్రికేయ మిత్రులకు మరియు శ్రీ సిరిపురపు శ్రీధర్ గారికి నా వందనాలు. ఈ సభ నిర్వహణకు  ఎంతో కృషి చేసిన మిత్రులు శ్రీ భాస్కర శర్మ, శ్రీ భాస్కర్, శ్రీ సుబ్రహ్మణ్యం, మరియు శ్రీ మధు లకు నా కృతఙ్ఞతలు. 
నిరంతరం సర్వాంతర్యామి ధ్యానంలో ఉండే యోగుల చరిత్రకు సంబంధించిన పుస్తకం ఒక పీఠాధిపతి కరకమలముల మీదుగా ఆవిష్కరించబడేలా చేసి తన  చమత్కారాన్ని మరో సారి ప్రదర్శించిన ఆ అరుణాచలేశ్వరునికి వేల వేల ప్రణామాలు.  ప్రస్తుతం అరుణాచల శివ .... అరుణాచల శివ .... అరుణాచల మరియు అరుణాచల యోగులు రెండు పుస్తాకాలు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు నా మొబైల్ నంబర్స్.  9490866124 లేదా 6302237224 కి కాల్ చేయవచ్చును. 

సర్వేజనా సుఖినో భవంతు. 
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  !!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...