శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయం, విశాఖపట్టణం
సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం కొందరు భక్తులు విశాఖ నుండి ఒడిశా రాష్ట్రం లో పురుషోత్తముడు జగన్నాధునిగా కొలువుతీరిన పూరి క్షేత్రాన్ని సందర్శించుకోన్నారట.
సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన ఈ దివ్య ధామ సందర్శనం వారిలో అపురూప ఆధ్యాత్మిక భావాలను వారిలో నెలకొల్పినది.
తమ ఊరు తిరిగి వచ్చిన తరువాత వారంతా కలిసి జగన్నాధునికి ఒక ఆలయం నిర్మించాలన్న నిర్ణయం తీసుకొన్నారు.
అలా ఆ భక్తుల సంకల్పంతో నిర్మించబడినదే నగరంలో పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న శ్రీ జగన్నాథ మందిరం.
తొలి తరం నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనే ఈ ఆలయంలోని శిల్పాలు, కట్టడాలు నేటికీ ఆకర్షణీయంగా ఉంటాయి.
నిత్య పూజలతో ప్రతి నిత్యం ఎందరో భక్తులతో కళ కళ లాడే ఈ ఆలయంలో జగన్నాథ రధ యాత్ర కూడా ఘనంగా నిర్వహిస్తారు.
జై జగన్నాథ !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి