కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో ఉన్న శ్రీ బాల పార్వతి సమేత శ్రీ జలదీశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత అరుదైనది లేదా ఒకే ఒక్కటిగా పేర్కొనవచ్చును.
ఆది దంపతులు ఇరువురు ఒకే పాను వట్టం మీద ఉపస్థితులైన దివ్య ధామం ఇదొక్కటే !
లయకారుడు లింగారూపంలోను, పార్వతి అమ్మ కూర్చున్న భంగిమలో ప్రక్క ప్రక్కనే ఉండి భక్తులను అనుగ్రహించే క్షెత్రమిది.
లభించిన ఆధారాలతో, జరిపిన పరిశోధనలతో ఈ క్షేత్రం రెండువేల సంవత్సరాలుగా వెలుగులో ఉన్నదని తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి