20, ఆగస్టు 2013, మంగళవారం

Puthen Veedu, Erumeli


                              పూతేన్ వీడు, ఎరుమేలి 





పూతన్ వీడు ఒక పౌరాణిక మరియు చారిత్రక సంఘటనకు నేటికి నిలిచిఉన్న ప్రత్యక్ష సాక్ష్యం.
శబరిమల వెళ్ళే ప్రతి భక్తుడు తప్పక దర్శించే క్షేత్రం ఎరుమేలి.
ఇక్కడ అనేక సంఘటనల తాలూకు నిదర్శనాలు కనిపిస్తాయి.
తన మహిమలతో సముద్ర దొంగ అయిన వావరున్ ని మార్చి మిత్రునిగా చేసుకొని ఒక పుజ్యనీయ స్థానంలో నిలిపారు శ్రీ అయ్యప్ప.
ప్రతి ఒక్కరు వావరు స్వామి సమాధిని సందర్సించుకొంటారు.













ఇక్కడ పెట్టతుల్లి అనే నృత్యం చేస్తారు. దీనిని వావరు మసీదు ఎదురుగా ఉన్న పేట్ట శాస్తావు ఆలయం నుండి ఆరంభించి వంటి కంతా రంగులు పూసుకొని స్వామి థిన్ధగ తోం అయ్యప్ప థిన్ధగ తోం అనే మేళంతో మసీదు లోనికి వెళ్లి వీభూది ప్రసాదం స్వీకరించి నాట్యం చేస్తూ ఎరుమేలి శ్రీ ధర్మ శాస్త ఆలయం వరకు వెళతారు భక్తులు. 




















అక్కడ ధ్వజస్తంభం దగ్గర మోసుకెళ్ళిన కూరగాయలు, బుడగలు, మొహాలకు పెట్టుకున్న రకరకాల ముసుగులను  వదిలి ఆలయం ముందు పారుతున్న కోరట్టి ( మణిమాల ) అనే చిన్న నదీపాయలో స్నానం చేసి శ్రీ ధర్మశాస్తాను దర్శించుకొని కాలి నడకన లేదా వాహనాలలో పంబ చేరుకొంటారు. 
పేట్ట తుళ్ళ నృత్యం చేయడానికి కారణం ఇక్కడే శ్రీ అయ్యప్ప మహిషిని సంహరించారని, లోక కంటకురాలి  మరణాన్ని ఇలా ఆనందంగా నేటికి జరుపుకొంటున్నారు. 
ఎరుమేలి ( మహిషి మరణించిన స్థలం ) అన్న పేరు అలా వచ్చినదంటారు. 
ఆ రోజులలో మహిషి అకృత్యాలు పెరిగిపోవడంతో పందల రాజ కుమారుడు ఈ ప్రాంతానికొచ్చారు. 
రాత్రి సమయంలో ఇక్కడకు చేరుకొన్న అయ్యప్పకు అంతా చిమ్మ చీకట్లు కమ్ముకొని జన సంచారం లేకుండా కనిపించినది. వెతకగా వెతకగా ఒక చిన్న మట్టి ఇంట్లో చిరు దీపపు కాంతి కనిపించినది. స్వామి ఆ ఇంటికి వెళ్ళ గా అక్కడ నివసిస్తున్న వృద్దురాలు ఆయనకు స్వాగతం పలికి ఉన్న ఆహారాన్ని అందించినది. 
అప్పుడు స్వామి ఆమెను అక్కడ నెలకొన్న నిశబ్ద వాతావరణానికి కారణమడిగారు. 
దానికి ఆ ముదుసలి ఊరిలోని పురుషులనందరిని మహిషి చంపేసినదని, ఆ భయంతో చాలామంది గ్రామం వీడి వెళ్లిపోయారని తెలిపి, అతనిని కూడా త్వరగా వెళ్లి పొమ్మన్నది. 
నవ్విన కారణ జన్ముడు ఆమెను నిశ్చింతగా ఉండమని, ఆ రాత్రి ఆ మట్టి ఇంటిలోనే నిద్రించారు. మరునాడు వెళుతు మహిషి భాధ అతి తొందరలో తొలగి పోతుందని అభయమిచ్చారు. 
అలా నాడు అయ్యప్ప శయనించిన ఇల్లే పూతన్ వీడు. 











మరునాడు మహిషిని హతమార్చి విజయుడిగా తిరిగివచ్చిన స్వామి ఆమెకు విషయం తెలిపి, వారికి రక్షణగా తన కరవాలాన్ని వదిలి వెళ్ళిపోయారు. నాటి నుండి ఆ కరవాలం పూతన్ వీడు లోనే ఉన్నది. 
ఆ నాటి వృద్దురాలి వంశం వారే ప్రతి నిత్యం దీపారాధన చేసి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. 











అప్పటి నుండి ఆ ఇల్లు ఆలానే ఉన్నది. జ్యోతిష్యాన్ని అధికంగా విశ్వసించే కేరళలో దాని ప్రకారం  ఆ ఇంటిని అభివృద్ధి చేసి ప్రస్తుత నిర్మాణాల మాదిరి చెయ్యకూడదని, ఒకవేళ చేయాల్సి వస్తే మట్టితో, ప్రస్తుతమున్న చెక్కల స్థానంలో అవే జాతి కలపతో నిర్మించాలని తేల్చారు. అలా నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే 2011 వ సంవత్సరంలో అగ్ని ప్రమాదంలో అధిక భాగం కాలి పోయినా అలానే వుంచేసారు. 
ప్రస్తుతం పూతన్ వీడు శ్రీ గోపాల పిళ్ళై గారి అధ్వర్యంలో ఉన్నది. 









ఎరుమేలి ప్రధాన రహదారి మీదే ఉంటుంది పూతన్ వీడు. ఎవరిని అడిగినా చెబుతారు. 


స్వామియే శరణం అయ్యప్పా !!!!



2 కామెంట్‌లు:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...