27, ఏప్రిల్ 2013, శనివారం

Kurnool Temples

 తొలితరం శిరిడి సాయి బాబా ఆలయాలలో ఒకటి కర్నూల్ నగరంలో తుంగభద్రా నదీ తీరంలో, చరిత్ర ప్రసిధికెక్కిన కొండా రెడ్డి బురుజుకి సమీపంలో ఉన్నది.
సాయిబాబా మందిరాలంటారు .  కానీ దీనిని ఆలయం అనే పిలవాలి.  ఎందుకంటె ఉత్తర భారత శైలిలో కాకుండా పూర్తిగా దక్షిణ భారత పద్దతిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని తొలితరం నాటిది అని ఎందుకన్నానంటే ఆంధ్ర రాష్ట్రంలో సాయిబాబా అంతగా విస్త్రుత ప్రచారంలోనికి రాని కాలంలో కట్టారు కనుక.
 శ్రీ .  వీరస్వామి అనే భక్తులు 1949-1951 మధ్య కాలంలో నిర్మించారీ ఆలయాన్ని.
 గురుస్తానం, ధుని, ప్రదక్షిణ ప్రాంగణము, నంద దీపము, సాయి ధ్యాన మందిరము, శ్రీ దతాత్రేయ స్వామి,  నవ అవధూతల మండపము, శ్రీ సాయి భూలోకంలో నడయాడిన సమయంలో జరిగిన ముఖ్య ఘట్టాల చిత్రాలు ఇక్కడ చూడవచ్చును.










అన్ని పర్వ దినాలలో వైభవంగా ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. నిత్యం నియమంగా నాలుగు హారతులు జరుపుతారు . కర్నూల్ పట్టణంలో తప్పక దర్శించవలసిన వాటిల్లో శ్రీ సాయి బాబా ఆలయం ఒకటి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...