Pallipadai Temples of Tamilnadu
మళ్ళీ రాని వారి కోసం పళ్లి పాడై ఆలయం మన పవిత్ర భారతదేశ నలుదిశలా వేలాది పురాతన హిందూ దేవాలయాలు కనపడతాయి. వెయ్యి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సాంకేతికంగా అంతగా ఎదగని (?) సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసలతో యేండ్ల తరబడి వాటిని నిర్మింపచేశారు నాటి పాలకులు. శిల్పులు కూడా తమ విద్యను వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ కఠిన శిలలను రమణీయ శిల్పాలుగా మలచారు. సప్త స్వరాలను పలికించారు. అంత కష్టపడి నిర్మించిన వాటిల్లో కొన్ని నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. భక్తులకు కొంగు బంగారంగా నిలిచాయి. మరికొన్ని స్థానికంగా మాత్రమే గుర్తింపు పొందుతున్నాయి. మిగిలినవి మాత్రం ఎలాంటి ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరుకొన్నాయి. దాదాపుగా అన్నీ పరాయి దేశాల వారి దాడులకు గురి కావడం చెప్పుకోవలసిన విషయం. వివరణ, గణాంకాలను పక్కన పెట్టి నిర్మించిన నిర్మాతలైన చక్రవర్తులు, మహరాజులు, పాలకులు ఏమైనారు ? సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి విశిష్ట విశేష ఆలయాలు కట్టించిన వారు, తమ సామ్రాజ్యాన్ని నలుదిశలా వ్యాపింప చేసిన వారు, తమ వంశ గౌరవాన్ని ఇనుమడింప చేసి...