Thiruvahindrapuram Divyadesam
తిరువహీంద్రపురం నూట ఎనిమిది దివ్యదేశాలలో ప్రతి ఒక్క క్షేత్రం తమవైన విశేషాలతో అక్కడ స్వయం దేవాధి దేవుడు నడయాడారని నిర్ధారణ చేస్తున్నాయి. అందుకే ఈ దివ్య క్షేత్రాల పౌరాణిక గాథలు అనేక పురాణాలలోను మరియు పురాతన తమిళ గ్రంధాలలోను ప్రముఖంగా ప్రస్తావించబడినాయి. అదే కోవ లోనికి వస్తుంది తిరువహీంద్ర పురం దివ్యదేశం. శ్రీ వైకుంఠ వాసుడు శ్రీ దేవాధిదేవన్ గానే కాకుండా శ్రీ రంగనాధునిగా, శ్రీ రామునిగానే కాకుండా జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవునిగా కూడా కొలువైన ఈ క్షేత్రం విరజా (గరుడ) నదీతీరంలో ఉన్నది. బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం మరియు బృహన్నారదీయ పురాణాలలో తిరువహీంద్ర పురం గురించి సవివరంగా వివరించబడినట్లుగా తెలుస్తోంది. వాటి ప్రకారం ఈ క్షేత్ర పురాణ గాధ అనేక విశేషాల సమాహారం అని అర్ధం అవుతుంది. పురాణ గాధ బ్రహ్మదేవుని నుండి పొందిన వర గర్వంతో ముల్లోకవాసులను హింసించసాగారు . వాని బారి నుండి కాపాడమని దేవతలు,మహర్షులు లయకారుని ఆశ్రయించారు. తారక...