పోస్ట్‌లు

Dhanushkodi

చిత్రం
                                          ధనుష్కోడి   అవతార పురుషుడు శ్రీ రామచంద్రుడు తన ధనుస్సు తో తట్టి ఎక్కడ వారధి కట్టాలో నిర్ణయించారు. అదే విధంగా రావణ సంహారం తరువాత అదే ధనుస్సు కొనతో ఆ వారధిని కూల్చారట ! అందుకనే "ధనుష్కోడి" అన్న పేరు వచ్చినది.  భారత భూభాగం నుండి సముద్ర జలాల కారణంగా విడిపోయిన రామేశ్వరం లేదా పాంబన్ ద్వీపకల్పంలోని తూర్పుకోనన ఉంటుంది ధనుష్కోడి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామేశ్వరాన్ని ప్రధాన భూభాగముతో కలిపేందుకు 1914 వ సంవత్సరంలో "పాంబన్ బ్రిడ్జి"అని పిలిచే రైలు వంతెన నిర్మించారు. ఇదొక అద్భుత నిర్మాణం. ఎంతో  లోతైన సముద్రజలాలలో నిర్మించారు. ఈ రెండున్నర కిలోమీటర్ల వంతెన మధ్య భాగంలో, జలాల్లో పడవలు వచ్చినప్పుడు పైకి లేచి దారి ఇస్తుంది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం. 1988 దాకా రామేశ్వరం చేరడానికి ఒక్క రైలు మార్గమే ఉండేది. 1974లో రోడ్డు బ్రిడ్జి కట్టడానికి శంకుస్థాపన జరిగింది. ప్రకృతి...

Anegondi

చిత్రం
                          నాటి కిష్కిందే .... నేటి అనెగొంది ... .  చరిత్ర లోతుల లోనికి వెళితే ఎన్నో అద్భుతాలను వీక్షించవచ్చును. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలలో చారిత్రిక స్థలాలే  ఎక్కువగా  పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. గత తరాల పాలకుల గురించి, వారి పాలన గురించి, నాటి ప్రజల జీవన విధానాలు, స్థితిగతుల  గురించి తెలుపుతాయి ఈ స్థలాలు. చరిత్ర పట్ల ఆసక్తి గల వారికి ఇవి అక్షయ పాత్రలు.  మిగిలిన దేశాలకు మన దేశానికి ఈ విషయంలో ఉన్న ఒక చిత్రమైన తేడా ఏమిటంటే మన దగ్గర చారిత్రక ప్రదేశాలు చరిత్రతో పాటు  విశేష పౌరాణిక నేపథ్యం మరియు ఊహకు అందని శిల్పచాతుర్యం కలిగి ఉండటం !!                                                                                         ...