Ashtabujakaram Temple, Kanchipuram
అష్టభుజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం విష్ణు కంచి లోని మరో శ్రీ వైష్ణవ దివ్య దేశం "అష్టభుజ పెరుమాళ్ ఆలయం". ఎనిమిదో శతాబ్ద కాలంలో పల్లవ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం లోని మూలవిరాట్టు ప్రత్యేకంగాను, శాంత సుందరంగాను దర్శనమిస్తారు. ఈ ఆలయ పురాణ గాధ కూడా సరస్వతీ దేవి మరియు బ్రహ్మ దేవుల మధ్య వివాదానికి సంబంధించినదే !!! తాను ఎన్ని అడ్డంకులు సృష్టించినా విధాత అశ్వమేధ యాగం కొనసాగించడంతో మరింత ఆగ్రహించిన అమ్మవారు భయంకరమైన సర్పాన్ని పంపినదట. యాగ సంరక్షణార్థం ఉన్న శ్రీహరి ఆ క్రూర సర్పాన్ని సంహరించడానికి ఎనిమిది రకాల ఆయుధాలను చేపట్టారట. నిలువెత్తు రూపంతో అష్ట భుజాలతో, రమణీయ అలంకరణతో శాంత సుందర రూపంతో భక్తులకు అభయం ఇస్తారు శ్రీ అష్ట భుజ పెరుమాళ్. స్వామి చక్రం, గద,కత్తి,బాణం, ధనుస్సు,పద్మం, శంఖు, డాలు ధరించి ఉంటారు. మరో కథనం ప్రకారం గజరాజు గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడి మోక్షాన్ని ప్రసాదించినది ఇక్కడే అని అంటారు. ఈ కారణం చేతనే ఆలయానికి వెలుపల ఉన్న పుష్కరిణిని "గజేంద్ర పుష్కరణి" అంటారు. అమ్మవారు శ్రీ పుష్పక వల్లీ తాయారు విడిగా మరో...