2, అక్టోబర్ 2018, మంగళవారం

Guhai Namah Shivaaya

                                    గుహాయ్ నమః శివాయ 






తలచినంతనే ముక్తిని ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై. మరి అక్కడే ఉంటూ ప్రతి నిత్యం అరుణాచలేశ్వరుని ఆరాధిస్తూ, ఆయన సేవలో పరవశిస్తూ అనుగ్రహానికి పాత్రులైన ముముక్షువులు ఎందరో !
అలాంటి వారిలో తొలి తరం వారు శ్రీ గుహాయ్ నమః శివాయ.  ఈయన కర్ణాటక రాష్ట్రంలో 1548 సంవత్సరంలో జన్మించారుతల్లితండ్రులు ఆచారవంతులు శివ 
భక్తులుచిన్నప్పటి నుంచి ఈయన ఆధ్యాత్మిక ఆలోచనలతో,మౌన ధ్యానాలతో గడిపేవారట.కన్నవారి అనుమతితో శ్రీశైలం చేరి వీరశైవుడైన శ్రీ శివానంద దేశికర్ను ఆశ్రయించారు.గురువు దగ్గర దీక్ష తీసుకొని,భక్తి శ్రద్దలతో సేవించేవారు.శివానంద దేశికర్ యోగ విద్యలో నిష్ణాతులు.శిష్యుని దీక్షా దక్షతలకు ఆనందించిన శివానంద దేశికర్ శివ యోగము భోదించారుదీనిలో గురువు ప్రసాదించిన ఇష్టలింగాన్నిఎడమ అరచేతిలోఉంచుకొని తదేక దృష్టితో చూస్తూ
ప్రాణాయామం చేయాలి.  ప్రతి ఒక్కటీ శివరూపం గానే భావించాలిహృదయం లో అదే భావన కలిగి ఉండాలిఅదే 
దృష్టితో  చూడాలిఇలా చేయడం వలన శరీరంలోని ఆరు చక్రాలు ఉత్తేజితమై కుండలినీ శక్తిని జాగృత పరుస్తాయి
గురువు నుండి పొందిన శివ యోగను ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ప్రావీణ్యాన్ని పొందారు గుహాయ్ నమః శివాయ















ఒకనాటి రాత్రి శ్రీ శైల మల్లిఖార్జున స్వామి స్వప్న దర్శనమిచ్చి తిరువణ్ణామలై వెళ్ళమని ఆదేశించారటగురువు అనుమతి తీసుకొని బయలుదేరారుఈయనతోపాటు దేశికర్ మరో శిష్యుడైన విరుపాక్షదేవ కూడా ప్రయాణించారుభగవాన్ రమణ మహర్షి పదహారు సంవత్సరాలు తపస్సు చేసిన విరూపాక్ష గుహ పేరు ఈయన పేరు మీదగాని వచ్చినది అంటారు
గుహాయ్ నమఃశివాయ అంత ప్రసిద్ధులు కారు విరూపాక్ష దేవనిరంతరం ధ్యానంలో ఉండేవారటచివరకి దేహత్యాగం చేసినప్పుడుఆయన దేహం ఒక విభూతి కుప్పలాగా మారిపోయిందిఒక పీఠికలో ఉంచిన  విభూధిని విరూపాక్ష గుహలో నేటికీ పూజిస్తారు















అరుణాచలం చేరుకొన్న గుహాయ్ నమఃశివాయ అక్కడక్కడా తిరుగుతూబిచ్చమెత్తుకుంటూ 
కాలం గడిపేవారు
ఆయన  గొప్ప యోగి అని స్థానికులు గ్రహించారుఆయన శక్తి రెండు సంఘటనల ద్వారా లోకానికి తెలిసింది.  ఒక గృహస్థు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారుసాదరంగా ఆహ్వానించి పాద పూజ చేశాడా గృహస్థు.అక్కడున్నఅందరికీ విభూధిని ప్రసాదంగా అందించారు గుహాయ్నమః శివాయతరువాత కొద్దిసేపటికి ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలీదు అగ్ని ప్రమాదంలో ఇల్లు మొత్తం 
దగ్ధమై పోయిందిశుభకార్యక్రమ వేళ సన్యాసి ఇచ్చిన బూడిద మూలంగానే  విపత్తు సంభవించినది అని అందరూ విమర్శించసాగారు.   తనను ఎన్ని అన్నా పట్టించుకోని గుహాయ్ నమః శివాయపరమ పవిత్రమైన విభూధిని చులకన చేయడం సహించలేక పోయారుతదేక ధ్యానం చేశారుఅందరూ చూస్తుండగానే కాలి  బూడిద అయిన ఇల్లు యధాతధంగా 
సాక్షాత్కరించిందిఅప్పటిదాకా ఎన్నో మాటలన్న వారు ఆయన సిద్ధపురుషుడనిస్వయం పరమేశ్వరుడని కీర్తించసాగారుదూషణ భూషణాలకు చలించని  సర్వసంగపరిత్యాగి భవిష్యత్తులో ఎవరింటికి వెళ్లకూడదని నిర్ణయించుకొన్నారుఅప్పటి నుండి ఆయన మండపాలలో  తోటలలో ఉండేవారు















రెండో ఘటన ఆయన ఆలయ ప్రవేశంవీరశైవులకు ఆలయ ప్రవేశం నిషిద్ధంఅందుకని ప్రతి నిత్యం తూర్పు వాకిట నిలిచి అక్కడ నుండే అరుణాచలేశ్వరునికి నమస్కారాలు సమర్పించుకొని వెళ్లేవారుఆయనను చూస్తున్న ఒక 
సాధువుఆలయం లోనికి వెళ్లకుండా వెలుపల నుండే వందనం చేస్తున్న గుహా నమః శివాయను అర్ధం చేసుకోలేకఅది ఆయన అహంకారానికి నిదర్శనమని అనుకొని తగిన విధంగా బుద్ది చెప్పాలనుకున్నాడుమరుసటి రోజు 
నమస్కరిస్తున్న గుహాయ్ నమః శివాయ వీపు మీద కర్రతో కొట్టాడుఆయన దెబ్బను పట్టించుకోకుండా దెబ్బతో  అరుణాచలేశ్వరుడు  తనలోని చెడ్డ గుణాలను తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమిళంలో ఒక శ్లోకం చెప్పారట ఆశువుగా !
ఆయన  గొప్ప సత్పురుషుడని  సాధువుకు అర్ధమయ్యి క్షమాపణలు చెప్పి శిష్యుడయ్యాడుఅదే రోజు రాత్రి 
గుహాయ్ నమః శివాయకు ఒక స్వప్నం వచ్చినదిగురువైన శివానంద దేశికర్ శిష్యసమేతంగాఅరుణాచలేశ్వరుడిని సేవించుకొన్నట్లుగా గోచరమైనదిమేలుకొన్న గుహాయ్ నమః శివాయకు అది తన మనస్సులో మెదులుతున్న ఆలోచనకి గురువు ఇచ్చిన అనుమతిగా భావించి నాటి నుండి ఆలయం లోనికి వెళ్లి స్వామివారికి పూలదండతో 
పాటు ఒక కీర్తన సమర్పించుకొనేవారు.












 సమయంలో ఆయన ఆలయ పెరియ గోపురం దగ్గరే ఉండేవారుఒకరోజు స్వప్నంలో అరుణాచలేశ్వరుడు కనిపించి "నువ్వు అరుణాచల పాదాల వద్ద ఉన్న గుహలో నివసిస్తూ శివ యోగ సాధన చెయ్యిఅని ఆదేశించారు
మహాదేవుని ఆజ్ఞ  శిరసావహించి గుహకు వెళ్లిన ఆయన జీవితాంతం అక్కడే ఉండి పోయారుఅలా గుహలో నివసించినందున ఆయన పేరు ముందు గుహాయ్ చేరిందిఅక్కడ ఉంటూనే ఎన్నో మహిమలను ప్రదర్శించారుఅకాల మరణం చెందిన వారిని బ్రతికించారుభగవంతునితో పరిహాసాలు ఆడిన వారికి తగు విధంగా బుద్ది చెప్పారు
గుహాయ్ నమః శివాయ అరుణాచలాన్నిఅరుణాచలేశ్వరుని ప్రస్తుతిస్తూ ఎన్నో కీర్తనలను రచించారుదురదృష్టవశాత్తు వాటిల్లో  కొన్నే సంరక్షించబడినాయిఅవే "అరుణగిరి అంతాదిమరియు "తిరువరునై తనివెంబ". రెండూ కలిపి నూట ముప్పై ఆరు కీర్తనలు.
భగవాన్ శ్రీ రమణ మహర్షి విరూపాక్ష గుహలో నివసించడానికి ముందు కొంతకాలం  గుహలోనే ఉన్నారుఇక్కడే ఆయన శ్రీ శివప్రకాశం పిళ్ళై కి కాగితం మీద జవాబులు రాసి ఇచ్చినది ప్రశ్న జావాబులే తరువాత ముద్రించబడిన "నేను ఎవరు?"(who am I ?)   భగవానులు గుహలో తాళపత్రాల పైన గుహాయ్ నమః శివాయ రచించిన కీర్తనలను చూసివాటిని కాగితాల మీద రాశారుతరువాత వాటిని ముద్రించడం జరిగింది














అరుణాచల పాదాల వద్ద పై గోపురానికి ఎదురుగా కొంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అప్పటి గుహ. ప్రస్తుతం ఆలయంగా రూపుదిద్దికొన్న దీనిలో శ్రీ గుహాయ్ నమః శివాయ జీవ సమాధి ఉంటుంది. ప్రతి నిత్యం త్రికాలాలలో పూజలు నిర్వహిస్తారు.












సుమారు నూట యాభై సంవత్సరాలు ఆయన నివసించి జీవసమాధి చెందిన గుహఆలయ 
వాయువ్య దిశ నుండి విరూపాక్ష గుహకు వెళ్లే దారిలో ఉంటుంది.ఎవరిని అడిగినా చెబుతారు
తిరువణ్ణామలై లో నివసించి అణ్ణామలయ్య కృపాకటాక్షాలతో ముక్తి పొందిన గొప్ప సిద్ధులు శ్రీ 
గుహాయ్ నమః శివాయ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...