Sabarimala Photos

                                  శబరిమల కొన్ని చిత్రాలు 

హరిహర పుత్రుడు శ్రీ ధర్మ శాస్త కొలువుతీరిన క్షేత్రం శబరిమల.
పవిత్ర పంబా నదీ తీరాన దట్టమైన అరణ్యాలలో ఉన్న ఈ దివ్య క్షేత్రానికి దీక్ష ధరించిన స్వాములు నవంబరు నుండి జనవరి వరకు లక్షలాదిగా వస్తుంటారు.
కానీ విడి రోజులలో అంటే మిగిలిన నెలలో అక్కడ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి చాలా మందికి కలుగుతుంటుంది. 



స్వామి దయ వలన గత ముప్పై ఆరు సంవత్సరాలుగా దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళే అదృష్టం నాకు లభించినది.
అదే కాకుండా ఉద్యోగరీత్యా కేరళలో ఎక్కువ తిరిగే నాకు నెల పూజల ( ప్రతి నెలా పదిహేను నుండి పంతొమ్మిది వరకు ఆలయం తెరుస్తారు) సమయంలో కూడా దీక్షలో లేకుండా సందర్శించే అవకాశం సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు దక్కుతుంది.


ఆ సమయంలో పంబ నదీ తీరం, నడక దారి, సన్నిధానం అతి తక్కువ భక్త సంచారంతో, నిరంతరం కురిసే వాన లతో ఎంత ఆహ్లాదకరంగా మరియూ ప్రశాంతంగా ఉంటాయి నాకు అనుభవం. 







పది పూజ చూసే అరుదైన అవకాశం కూడా కలుగుతుంది.




















ఇవన్ని అందరితో పంచుకొందామని ఈ చిత్రాలను పోస్ట్ చేస్తున్నాను.
శబరిమల లోని పవిత్ర పంబా నది లో స్నానమాచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భావిస్తారు భక్తులు.
అందుకే దక్షిణ భగీరథి అని కూడా పిలుస్తారు.
కేరళలో పెరియార్, భరత్ పుళ నదుల తరువాత అతి పెద్దది పంబే!
పట్టనంతిట్ట మరియు అలెప్పి జిల్లాలను సస్యశ్యామలం చేస్తుందీ పవిత్ర నది.
పీరమేడు లో ఉన్న పులచిమలై పర్వతాలలో ఉద్భవించి, తన ప్రవాహ మార్గంలో పది ఉపనదులను ( అలుత్తయార్, కక్కియార్, కక్కట్టార్, కల్లార్, పెరున్తేనరవి, మదతరువి, తనుంగత్తిల్తోడు, కొలితోడు, వరట్టార్ మరియు కుట్టెంపేరూర్)
కలుపుకొని చివరకు వెంబనాడు సరోవరంలో కలుస్తుంది.
శబరిమల వద్ద పంబతో కక్కట్టార్, కల్లార్ నదులు సంగమిస్తాయి.
ఆ కారణంగా ఈ తీరం త్రివేణీ సంగమం తో సమానమైనదిగా భక్తులు భావిస్తారు.
 ఈ దక్షిణ భగీరథి తీరంలో గతించిన పెద్దలకు పిండ ప్రధానం చేయడం  అత్యంత పవిత్ర మైనదిగాను వారికి ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుంది.

స్వామియే శరణం అయ్యప్ప !!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore