శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం, విశాఖపట్నం
నగరంలో పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి అత్యంత చేరువలలో ఉన్న పురాతన ఆలయం ఇది.
విశాఖలో నిర్మించబడిన పురాతన దేవాలయాలలో ఇదొకటి.
మొట్టమొదటి శ్రీ రామ ఆలయంగా పేర్కొంటారు.
జమిందారులైన అంకితం వారు తమ వంశాభివృద్దిని ఆకాంక్షిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలియవస్తోంది.
నేటికి ఆ వంశం వారే ధర్మకర్తలు.
శ్రీ రామ నవమితొ సహా అన్ని పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విశాఖపట్నంలో తప్పని సరిగా దర్శించవలసిన ఆలయాలలో చెంగలరావు పేటలో ఉన్న ఈ ఆలయం కూడా ఒకటి.
జై శ్రీ రామ్ !!!