Narmada Pushkaraalu
నర్మదా పుష్కరాలు సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావించడం జరుగుతోంది. మన పురాణాలు కూడా అదే విషయాన్ని విపులంగా తెలిపాయి. నింగి, నేల, నీరు, గాలి మరియు నిప్పు అన్నీ దైవస్వరూపాలే ! అలా భావించడానికి తగిన కారణాలను మన పురాణాలు సోదాహరంగా వివరించాయి. పంచ భూతాలు ప్రతి ఒక్కటీ మానవ జీవితాలకు తప్పనిసరి. జీవనాధారం. ఒకటి ఉండి మరొకటి లేకపోతే జీవనయానం ఆగిపోతుంది. అంతటి విలువైనవి కనుకనే ప్రతి ఒక్కదానిని గౌరవించడం, పూజించడం, కృతజ్ఞతా భావంతో ఉండటం అవసరమని పెద్దలు తెలిపారు. అలా జరగడం వలననే ఇన్ని యుగాలు, తరాల తరువాత కూడా మనందరం కొంతవరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. ఈ పంచ భూతాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి. ఆకాశంలోని మేఘాల వలన కురిసిన వానలతో భూమి పులకించి చక్కని పంటలు అందిస్తుంది. పచ్చని చేల మీదగా, చెట్ల మీదగా వీచే గాలి ప్రాణవాయువు ఆహ్లదకరం. జీవనావసరం. పండిన పంటల...