Vellamassery Garudan Kavu

వినుతాసుతుని ఏకైక ఆలయం - గరుడన్ కావు మన హిందూ దేశం అనాదిగా సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వయం నడయాడిన పుణ్యభూమి. మానవ జీవిత అర్ధం పరమార్ధం తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పుట్టిన పుణ్య భూమి. మనకి భగవంతుని పట్ల అచంచల విశ్వాసం. ముఖ్యంగా జీవితంలో కష్టకాలంలో, అనారోగ్య విషయంలో, ఆర్ధిక సమస్యలలో ముందుగా గుర్తుకు వచ్చేది దేవదేవుడే ! ఈ కారణంగా మనకి ఎందరెందరో దేవీదేవతలు. వారందరికీ వేరువేరు బాధ్యతలు అప్పగించబడినాయి. అవసర సమయంలో వారు అర్హులై పుణ్య కర్మ కలిగిన భక్తులను ఆడుకుంటారు అని తెలిపే దృష్టాంతాలు మనకి పురాణాలలో, క్షేత్ర గాధలలో కనిపిస్తాయి. ఈ విశ్వాసాలకు అనుగుణంగా ఎన్నో ఆలయాలు కూడా మనదేశం నలుమూలలా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రత్యేక, అరుదైన ఆలయాల ప్రదేశం ఈ దేవతల స్వస్థలం. దేశంలో అతి అరుదుగా కనిపించే ఎన్నో దేవీదేవతల దేవాలయాలు కేరళలో కనిపిస్తాయి. అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ గరుడన్ కావు". శ్రీ మన్...