28, డిసెంబర్ 2017, గురువారం

Ghorakpur

ఘోరకనాథ్ మఠం 





క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ద కాలంలో ఉత్తర భారత దేశంలో పదహారు సామ్రాజ్యాలు ఉండేవని పురాణ మరియు చరిత్ర గ్రంధాలు తెలుపుతున్నాయి. 
అవి అంగ, అసక, అవంతి,చేది,గాంధార,కాంభోజ, కాశీ, కోశల, కురు,మగధ, మల్ల, మత్స్య, పాంచాల, సూరసేన, వజ్జి(వ్రజ). 
వీటిల్లో అవతార పురుషుడు శ్రీ రాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశం పాలనలో ఉన్న కోశల దేశం మరింత ప్రసిద్ధి గాంచినది. 
అనంతర కాలం ఈ ప్రాంతాన్ని మౌర్యులు, కుషాణులు,గుప్తులు మొదలైన వారు పాలించారు. 
పరమహంస యోగానంద 1893వ సంవత్సరం జనవరి అయిదో తారీఖున ఘోరకపూర్ లోనే జన్మించారు. 
పదకొండవ శతాబ్దానికి చెందిన ఘోరకనాథ్ నాథ సంప్రదాయాన్ని ఆరంభించారని తెలుస్తోంది. ఈయనను మహా యోగి అని పిలుస్తారు. మత్స్యేంద్రనాథ్ ఈయన గురువని చెబుతారు. 













ఘోరకనాథ్  నాథ సాంప్రదాయం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా ప్రచారం సాగించారని తెలుస్తోంది. ఆయన స్మృతి చిహ్నంగా ఈ మఠం స్థాపించబడినది. ఆయన మూలానే ఈ ఊరికి ఆ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో మఠం నేపాల్ లోని "గుర్ఖా"
జిల్లాలో ఉన్నది. ఈ జిల్లా పేరు కూడా బాబా ఘోరకనాథ్ పేరు మీద గానే ఏర్పడినట్లుగా చెబుతారు.
ఘోరకపూర్లో బాబా ఘోరకనాథ్ చాలా కాలం ధ్యానంలో ఉన్నారని, ఆ పీఠం మీదనే ప్రస్తుత మందిర నిర్మాణం జరిగింది. ఆయన తపస్సు చేసిన గద్దె మీద పెద్ద విగ్రహాన్ని నిలిపారు.  















సువిశాల ప్రాంగణంలో, ఘోరకపూర్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ మఠం ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది.
ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్య నాథ్ యోగి ఈ మఠానికి ప్రధాన గురువులు.
















ఎన్నో ఆలయాలు నెలకొని ఉంటాయి ఈ ప్రాంగణంలో !! ఉచిత వైద్యశాల ఇత్యాదులు కూడా మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 
ఘోరకపూర్ చేరుకోడానికి దేశంలోని అన్ని ముఖ్య నగరాల నుండి రైలు సౌకర్యం కలదు. వారణాసి లేదా అయోధ్య నుండి కూడా ఇక్కడికి బస్సు లేదా రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...