6, డిసెంబర్ 2017, బుధవారం

Request

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.





శ్రీ లక్కరాజు శివరామకృష్ణ రావు, శ్రీమతి. భార్గవీ దేవి (చికాగో)దంపతుల ఆర్ధిక సహాయంతో   "అరుణాచల శివ... అరుణాచల శివ...  అరుణాచల" పుస్తకం గత జులైలో  అందరికీ అందుబాటు లోకి వచ్చింది. అరుణాచలేశ్వరుని భక్తులు, భగవాన్  శ్రీ రమణ మహర్షి భక్త బృందాలవారు, మరెందరో ఆధ్యాత్మిక మార్గాన్వేషకులు రెండో ముద్రణకు తమ వంతు ఆర్ధిక సహాయం అందించారు. దానికి కొంత మొత్తం కలిపి రెండో ముద్రణ వేయించడం జరిగింది.
రెండో సంచికలో ప్రముఖ రచయితలు, భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తులు అయిన శ్రీ. పింగళి సూరి సుందరం గారు, శ్రీ రావినూతల శ్రీ రాములు గారు కొన్ని విషయాలను జత చేయమని ఇచ్చిన సలహాల మేరకు మార్పులను చెయ్యడం జరిగింది.
వారికీ నా హృదయ పూర్వక పాదాభివందనాలు.
ఆర్ధిక సహాయం చేసిన ఆదోని, విజయవాడ, ఒంగోలు, గుంటూరు కు చెందిన శ్రీ రమణ సత్సంగ బృందాల వారికి, హైదరాబాద్, నెల్లూరు, కడప, గుంటూరు, తెనాలి పట్టణాల భక్తులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటూ వారికి  శ్రీ అణ్ణామలేశ్వర స్వామి వారి అనుగ్రహం  సంపూర్తిగా ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.









ప్రస్తుతం మూడో ముద్రణకు ప్రయత్నాలు ఆరంభించాను. భక్తులను తమ వంతు సహాయం అందించమని మరో మారు అభ్యర్ధిస్తున్నాను.
మూడో ముద్రణంతో పాటు "జన్మ నక్షత్ర మరియు జన్మ రాశి ఆలయాలు" అన్న మరో పుస్తకం కూడా ముద్రించ తలచాను. ఆ పుస్తకంలో ఆయా ఆలయాల పూర్తి విశేషాలతో పాటు ఆయా నక్షత్రాల లేదా రాశి వారు గ్రహ అనుగ్రహం కొరకు ఎలాంటి పూజలు జరిపించుకొంటే జీవితంలో ఉన్నత స్థితి చేరుకొంటారో వివరంగా తెలపడం జరుగుతుంది. వీటితో పాటు నిత్య జీవితంలో విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతానం, కోర్ట్ విషయాలు, ఋణ భాధలు, అనారోగ్యం, ఎలాంటి సమస్యకు ఏ ఆలయంలో ఏ పూజ జరిపించుకోవాలో  అన్న పరిహార క్షేత్రాల వివరాలు మరియు అక్షయ తృతీయ నాడు ఏ నక్షత్రం వారు బంగారం ఒకటే కాకుండా వేరే ఏమి కొనుగోలు చేస్తే వృద్ధి కలుగుతుందో అన్న వివరాలు ఇవ్వడం జరుగుతుంది.













ఈ పుస్తకాలు అందరికి ఉచితంగా ఇవ్వడానికి కారణం ఒకటే ! మన దేశంలో ఉన్న అపురూప, మహనీయ, పవిత్ర ఆలయాల గురించి అందరికీ తెలియచేయాలని, వాటిని సందర్శించి అందరూ ఆ పరమాత్ముని కరుణాకటాక్షాలు పొంది జీవితంలో అభివృద్ధి చెందాలన్నదే !
ఈ మహా కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించాలని ఈ బ్లాగ్ చదివేవారికి  శిరస్సు వంచి విన్నవించుకొంటున్నాను. మీరు పంపే ప్రతి ఒక్క రూపాయీ పదిమందిని  భగవంతుని కృపకు పాత్రులను చేసి, అలా లభించే మానసిక ధైర్యంతో   జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయట పడవేయడానికి ఉపయోగపడుతుంది.
 ఆ పుణ్యఫలం మీదే  !!!
ఆర్ధిక సహాయం ఈ క్రింది బ్యాంకు అకౌంట్ నెంబర్ కి పంపగలరు.

I.J.Venkateshwerlu,  ICICI Bank, M G Road branch, Vijayawada.
A/c. no.630601522726. IFSC code. ICIC0006306.


 సర్వేజనా సుఖినో భవంతు !!!!

ఇలపావులూరి జనార్దన వెంకటేశ్వర్లు,
విజయవాడ
9052944448

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...