జటాయుపర, కొల్లం
కేరళ ఎన్నో రకాల పర్యాటక పధకాల అమలులో చాలా అభివృద్ధి చెందినది. సంవత్సరం పొడుగునా దేశవిదేశాల పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు.
ఆ క్రమంలో స్థానిక, దూర ప్రాంత సందర్శకులను ఆకర్షించేందుకు రూపుదిద్దుకున్న మరో పథకమే జటాయు పర. కొల్లం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఆ క్రమంలో స్థానిక, దూర ప్రాంత సందర్శకులను ఆకర్షించేందుకు రూపుదిద్దుకున్న మరో పథకమే జటాయు పర. కొల్లం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
సీతా దేవిని అపహరించుకొని పోతున్న రావణాసురుని జటాయువు అడ్డుకొని, వీరోచిత పోరాటం జరిపి అసువులు బాసినదని ఇక్కడే అన్నది స్థానిక విశ్వాసం. ఈ పురాణ గాధను ఆధారంగా చేసుకొని ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు శ్రీ రాజీవ్ ఆంచల్ తలపెట్టిన ఒక మెగా పర్యాటక ఆకర్షణ జటాయుపర.
మేము 2011వ సంవత్సరంలో శబరిమల యాత్ర సందర్బంగా ఇక్కడికి వెళ్లడం జరిగింది. అప్పుడు శ్రీ రాజీవ్ ని కలవడం కూడా జరిగింది. అప్పటి ఫొటోలే ఇక్కడ పెడుతున్నాను.
సుందర ప్రకృతికి నెలవైన ప్రాంతంలో అరవై ఎకరాల ప్రదేశంలో ఎన్నో విధములైన ఆకర్షణలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
థీమ్ పార్కు, అడ్వెంచర్ పార్క్, పైకి వెళ్ళడానికి రోప్ వే, రెస్టారెంట్, ఆయుర్వేద చికిత్సాలయం, సినిమా హాల్, మూన్ లైట్ డిన్నర్ ఇలా అనేకరకాల ఆకర్షణలు రాబోతున్నాయి అక్కడ.
కొండ మీదకి వెళ్లే మూడు కిలోమీటర్ల మార్గం ఒక రకమైన సాహసంతో కూడుకున్నదే ! ఏపుగా పెరిగిన గడ్డి ఇతర మొక్కల మధ్యగా దారి చేసుకొంటూ వెళ్ళాము అప్పుడు. క్రూర మృగాలు ఏవీ లేవు కానీ పాముల భయం మాత్రం వెన్నంటినది.
కాకపోతే ఏమీ ఎదురు కాలేదు. పైన నిర్మాణంలో ఉన్న రెండువందల అడుగుల పొడవు, నూటయాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తుతో గల జటాయువు శిల్పం ఒక అద్భుతంగ పేర్కొనాలి. పక్షి చనిపోయినప్పుడు కాళ్ళు పైకి పెడుతుంది. అదే విధిగా ఉంటుందీ శిల్పం.
ఈ ఆగస్టులో పూర్తి చేసి ప్రారంభిస్తారని చెప్పారు. కానీ ప్రారంభం కాలేదని తెలుస్తోంది.
ఆరంభం అయిన తరువాత కేరళ అదీ కొల్లం వెళ్లే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం జటాయుపర.
ఒక రోజు ఆటవిడుపుగా ఇక్కడ అన్నీ మర్చిపోయి గడపే అవకాశం కలిగించే ప్రదేశం జటాయుపర.
పూర్తి అయితే కనపడే జటాయువు శిల్పం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి