Sri Ranganatha Temple, Thiruvathigai

                        శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరు వధిగై














తిరువదిగై లోని మరో పురాతన ఆలయం శ్రీ రంగనాధ స్వామి కొలువైనది.
ఒక భక్తురాలి అనన్య సామాన్యమైన భక్తి, ఆమె కోరికను గౌరవించిన భర్త వలన చక్కని ఆలయం ఒకటి మనకు దర్శించుకొడానికి లభించినది.
పల్లవరాయ చోళ రాజు కుమార్తె అతి సౌందర్య రాశి. సకల విద్యలను అభ్యసించినది.ఆమె గురించి విన్న తిరు వధిగై రాజు ఆమెను వివాహమాడాలని నిర్ణయించుకొని చోళ రాజుకు కబురు పంపారు.చోళ రాజుకు ఆనందము విచారము సమస్థాయిలో కలిగినవి.ఎందుకంటే రాజ కుమార్తె శ్రీ రంగనాథుని యందు అమిత భక్తి ప్రపత్తులు కలిగినది.తన ఆరాధ్య దైవాన్ని నిత్యం సేవించుకోనడానికి శ్రీ రంగం వెళ్ళడానికి సర్వం సిద్దం చేసుకొన్నది. అదే విషయాన్ని చోళుడు తెలియ చేసాడు.













దానికి తిరువధిగై రాజు తనను కళ్యాణ మాడితే చక్కని శ్రీ రంగని ఆలయాన్ని ఆమె కోసం నిర్మింపజేస్తానని వర్తమానం పంపాడు.అతని ప్రతిపాదనకు రాజ కుమార్తె సంతోషంతో అంగీకరించినది.వారి పెండ్లి  అయిన కొలది కాలం లోనే రాజు తను బాస చేసినట్లుగా ఆలయాన్ని నిర్మించాడు.
మహారాణి తన ఆరాధ్యదైవాన్ని అను నిత్యం సేవించుకొనే భాగ్యాన్ని సొంతం చేసుకొన్నది.
చిత్రంగా ఈ ఆలయం కూడా శ్రీ రంగం మాదిరి రెండు నదుల మధ్య ఉంటుంది.
అక్కడ "కొల్లిదాం మరియు కావేరి" కాగా ఇక్కడ " కేదిలం మరియు పెన్నా".
 సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నేటికీ సుందరంగా ఉంటుంది.తూర్పు ముఖంగా ఉన్న ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే  ఎదురుగా ప్రధాన ఆలయము, ఇరుపక్కలా తాయురు, ఆండాళ్ సన్నిధులు కనపడతాయి.ఒకపక్క రంగ మండపం మరో పక్క పాక శాల ఉంటాయి.చక్రత్తి ఆళ్వార్ సన్నిధి కూడా కలదు.ఆకర్షించే శిల్పాలు మాత్రం లేవు.సాదాసీదా నిర్మాణం. మండప స్తంభాల పైన చోళ రాజు ఆయన కుమార్తె అల్లుడు తదితరుల  విగ్రహాలు చెక్కారు.
















ఆలయ మండప స్తంభాల పైన చక్కని పురాణ ఘట్టాలను, శ్రీ మన్నారాయణుని వివిధ రూపాలను సుందరంగా నిర్మించారు .












గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో  నాభి నుండి విధాత బ్రహ్మ, పాదాల చెంత ఉభయ దేవురులతో చక్కని పుష్పాలంకరణతో విరాట్ విగ్రహ రూపంలో నేత్ర పర్వంగా దర్శనం ప్రసాదిస్తారు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పెరుమాళ్ విగ్రహం యెంత పెద్దదో ఉపాలయాలలో  కొలువుతీరిన శ్రీ రంగ నాయకి మరియు శ్రీ గోదా దేవి విగ్రహాలు కూడా అంతే పెద్దవి  !సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా ఆండాళ్ రూపం మిగిలిన ఆలయాలలో వాటికి భిన్నంగా ఉంటుంది.










ఉదయం ఆరు నుండి పదకొండు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో పూజలు సాంప్రదాయబద్దంగా   జరుపుతారు.
అన్నిపర్వ దినాలలో ప్రత్యేక  పూజలు అలంకారాలు చేస్తారు.
ధనుర్మాసం పూజలు, తిరుప్పావై గానం మరియు వైకుంఠ ఏకాదశి వైభవంగా చేస్తారు.
ఈ ఆలయం శ్రీ సార నారాయణ స్వామి ఆలయానికి అర కిలోమీటరు దూరంలో ఉంటుంది.
విల్లుపురం వైపు వెళితే తప్పక సందర్శించ వలసిన ఆలయం.
జై శ్రీ మన్నారాయణ !!!!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore