Sri Venugopala swami Temple, Nellore

     శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, మూలపేట, నెల్లూరు




ఎన్నో పురాతన చరిత్ర ప్రసిద్ది చెందిన దేవాలయాలు నెల్లూరు పట్టణం లోనూ జిల్లాలోనూ ఉన్నాయి. 
వాటిల్లో ఒకటి స్థానిక మూలపేటలో నెలకొని ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.
ఏనాటి నుంచి ఉన్నదో అన్న అన్న దాని  అయిన సమాచారం లభించడం లేదు.
లభించిన సమాచారం ప్రకారం ఈ  ఆలయాన్ని కీర్తి శేషులు ఘంటాబత్తుల పాపి రెడ్డి గారు 1883లో నిర్మించారని నిర్మించారని తెలుస్తోంది.
కాల క్రమంలో ఎందరో భక్త మహాశయులు ఆలయాభివ్రుద్దికి విశేష కృషి చేసారు.
మూలపేటలో ప్రసిద్ద మూలస్థానేశ్వర స్వామి స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది.







సువిశాల ప్రాంగణానికి ఆరంభలో స్వాగత ద్వారం మీద తిరునామం, శంఖు చక్రాలతో పాటు శ్రీ వేణు గోపాల స్వామి సుందర రూపాన్నిఉంచారు.











నూతనంగా నిర్మించిన అంజనా సుతుని ఆలయం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉంటుంది. 
రెండింటికి మధ్యన ఉన్న మండపం పైన మూలవిరాట్టుల రూపాలు. 
ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అన్ని పక్కలా ఏర్పాటు చేసిన మనోహర శిల్పాలు, చక్కని సూక్తులు  మరియు శ్లోకాలు.  
ఒక వర్ణమయ అద్భుత సజీవ చిత్రం చూస్తున్న అనుభూతి మనస్సులలో కదులుతుంది ఈ ఆలయాన్ని చూస్తే !!













ఆలయ నిర్మాణానికి సంభందించిన తెలుగు శాసనం ఒకటి ధ్వజస్తంభం ఎదురుగా ఉంటుంది.
కానీ ఆనుకొని ఆనుకొని అరిగిపోయి చదవడానికి వీలు లేకుండా పోయింది.








ధ్వజస్తంభం, బలి పీఠం, గరుడ సన్నిధి. ఇక్కడ మండపానికి ఇరువైపులా పంచలోహ దీప సుందరీ మణులను ఉంచారు.














దక్షిణ ముఖంగా ఉండే ఈ ఆలయంలో ఉత్తర ద్వారం కూడా ఉన్నది. చక్కని మూర్తులతో అలంకరించారు. ప్రదక్షిణా పధంలో గోడలకు కృష్ణ లీలల చిత్రాలను చిత్రించారు.













ఉన్న మూడు గర్భాలయ విమానాలను పురాణ ఘట్టాలతో, మూర్తులతో అలంకరించారు. 
తూర్పు వైపున ప్రాంగణం బయట గోశాల, ఆలయ పుష్కరణి ఉంటాయి. 
































ప్రదక్షణ పూర్తిచేసుకొని స్వామి సందర్శనార్ధం లోనికి వెళ్ళే ముందు మండపంలో ఉన్న గణపతికి మొక్కడం ఒక ఆనవాయితీ. 
మండపం పైన దశావతార రూపాలను నిలిపారు. 
గోడలపైన నేత్రపర్వమైన వర్ణాలతో శంఖు, చక్రాలను చిత్రించారు. 










 





గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి రమణీయ పుష్ప, స్వర్ణ ఆభరణాలు ధరించి నయన మనోహరంగా దర్శనమిస్తారు.
ఒక పక్కన శ్రీ లక్ష్మీ అమ్మవారు, మరో పక్క శ్రీ గోదా దేవి ( ఆండాళ్ ) కొలువుతీరి ఉంటారు. 









ప్రతి రోజు ఎన్నో విధములైన అబిషేకాలు, అలంకరణలు, అర్చనలు జరుగుతాయి.
ఏకాదశి, అష్టమి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, శ్రీ నారసింహ జయంతి లాంటి విష్ణు అవతారరూపాలతో ముడిపడి ఉన్న అనేక ఉత్సవాలను పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో, వారి  కొరకు అత్యంత వైభవోపేతంగా జరుపుతారు.
ఉగాది, వినాయక చవితి, దీపావళి పర్వదినాలలో భక్తులు విశేష సంఖ్యలో శ్రీ వేణుగోపాల స్వామి సందర్శనార్ధం తరలి వస్తారు.
ప్రాంగణంలో శ్రీ నారసింహ స్వామికి విడిగా ఆలయం ఉన్నది.














స్వాగత ద్వారానికి ఎదురుగా ప్రాంగణానికి వెలుపల చక్కని అష్టలక్ష్మి ఆలయం నూతనంగా నిర్మించారు. 












నెల్లూరు పట్టణంలో తప్పని సరిగా సందర్శించ వలసిన ప్రదేశాలలో మూలపేట శ్రీ వేణుగోపాల స్వామి ఒకటి.

కృష్ణం వందే జగద్గురుం !!!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore