Shivaalayam, Rompicherla


                                        శివాలయం, రొంపిచర్ల 

నరసరావుపేట మీదగా పని మీద రొంపిచర్ల వెళ్లి తిరిగి వస్తూ ఒంగోలు నుండి హైదరాబాదు వెళ్ళే రాష్ట్ర ప్రధాన రహదారి పక్కన కొద్ది సేపు ఆగినప్పుడు కనపడినది నూతనంగా నిర్మించబడిన స్వాగత ద్వారం. 
హరిహర నివాసం అని కాబోలు రాసి ఉంది. అక్షరాలు సరిగ్గా కనపడటం లేదు.  






 
 లోపల ఎక్కడో ఉన్న గ్రామానికి వెళ్ళే మట్టి దారి పక్కన విశాల ప్రాంగణంలో గుబురుగా పెరిగిన వేప, నిద్ర గన్ట్ చాయలో ఉన్నది ఈ ఆలయం.

సాయంత్రం నాలుగు సమయం. 
లోపలి నడిచి వెళ్ళగా మొదట దృష్టిని ఆకర్షించినది చెట్టు క్రింద ఉంచబడిన రెండు శాసనాలు. 
పురాతన తెలుగులో రాయబడిన వాటిల్లో చదవగలిగినంతలో శాలివాహన శకం లోని ఒక సంవత్సరం శివరాత్రికి దేవరకు ఉత్సవం మరియు పూజలు చేయడానికి భూరి విరాళాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 
కాలము, ఎవరు వేయించారో అన్న వివరాలు లేవు. 
శాసనం పైన శివ లింగం చెక్కివున్నది.  

  రేకు కప్పబడిన ధ్వజస్తంభంలో రామ చిలకలు కాపురం ఉంటున్నాయి. స్థంభం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి. ఏ నాటిదో మరి ?

 చక్కని నంది మండపం ఇట్టే ఆకర్షిస్తుంది.
లోపల సుందరమైన నందీశ్వరుడు గర్భాలయం వైపు చూస్తూ దర్శనమిచ్చాడు.


ప్రాంగణమంతా శిధిల శిల్పాలు పడివున్నాయి.
వాయువ్యంలో చిన్న శివ లింగం ఎదురుగా నంది. 





 విచారకర విషయం కాలగతిలో గర్భాలయం కూలిపోతే రేకులతో పునః నిర్మించారు.
కట్టడ అడుగు భాగాన రాళ్ళ మీద రక రకాల చెక్కడాలు చెక్కబడి ఉన్నాయి. 



గోడల కున్న పురాతన రాతి కిటికీ గుండా లోపలికి చూస్తే నల్ల రాతితో చెక్కబడిన చక్కని మండపం కనపడినది.
వెలుతురు తక్కువగా ఉన్నా మెరుస్తూ కనిపించిన మండపం లోపలికి వెళ్లి దగ్గర నుండి చూడాలన్న కోరిక పెరిగిపోయింది.
బయటికి నడిచి పూజారి గారి గురించి విచారించాను.
రొంపి చెర్ల గ్రామంలో ఉంటారట.  ఉదయం వస్తారని చెప్పారు.
 ఆలయాన్ని చూస్తే పురాతనమైనది అని తెలిసి పోతోంది.
రెడ్డి రాజులు, తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విజయనగర ఇలా ఎన్నో రాజ వంశాలు, వారి సామంతులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా ఆధారాలు ఉన్నాయి.
ప్రాంగణంలో ఉన్నఆలయాన్ని, శాసనాలు ఎవరు ఎప్పుడు చెక్కించారొ ?
తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలో ఇలాంటి పురాతన ఆలయ నిర్మాణాలకు, శాసనాలకు ఇచ్చే ప్రాధాన్యత మన రాష్ట్రంలో ప్రతి చిన్న గ్రామంలో ఉన్ననిర్మాణాలకు ఎప్పుడు ఇస్తారో ?
 పర్యాటకానికి తగిన ప్రాధాన్యత ఇస్తాం అంటుంటారు.
ఎప్పటికి ఇస్తారో  ???????
ఆ భగవంతునికే తెలియాలి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore