కూడలి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం - ఆలంపూర్
ఒకప్పుడు కృష్ణా నదీ తీరంలో ఉండే ఈ ఆలయాన్ని శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో ముంపుకు గురి అవుతున్నందున ఇక్కడికి తెచ్చి యదాతధంగా పునః నిర్మించారు.
అద్భుత శిల్పాలు ఈ ఆలయ సొంతం.
నాటి చాళుక్య రాజుల వాస్తు నమ్మకాలకు, శివ భక్తికి నిదర్శనంగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చును.
కొద్దిగా ఎత్తులో ఉన్న ఆలయమంతా ఎన్నో రకాల శిల్పాలు దర్శనమిస్తాయి.
క్రిందనే నంది మడపం.
ఆలయ ప్రధాన ద్వారానికి పక్కన మకర వాహనం మీద గంగా దేవి.
ఆలయ దక్షిణ, పడమర, ఉత్తర దిశలలో ఉన్న గోడలకు అష్ట దిక్పాలకులను ఉంచారు.
చాళుక్య రాజులకు వాస్తుని అమితంగా విశ్వసించేవారు.
కుబేరుడు, యముడు, వరుణుడు, ఇంద్రుడు ఇలా అందరి విగ్రహాలని ఆయా దిక్కులలో ఉంచారు.
కూడలి సంగమేశ్వర ఆలయంలో నాటి శిల్పుల శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం మొసలి నోట్లో ఉన్న బాలుడి శిల్పం.
ఒకో పక్కన ఒకో విధంగా అంటే నోట్లో చిక్కుకొని భాదపడుతున్నట్లు, దాని నోటిని చీల్చుతున్నట్లు, ఇలా ఒక నేడు చెప్పుకొనే త్రీ డైమంక్షేన్ చిత్రంలా కనపడుతుంది.
గతంలో కృష్ణా నదీ తీరంలో ఉన్నప్పుడు గతించిన పెద్దలకు అక్కడి సంగమ క్షేత్రంలో పిండ ప్రధానం చేసేవారు.
పవిత్ర తీర్థ క్షేత్రంలో స్వచ్చమైన ప్రేమాభిమానాలతో సమర్పించే పిండాలు భగవంతుడు స్వీకరిస్తాడు అన్నదానికి ఈ శిల్పం నిదర్శనంగా చూపుతారు.
ఆలంపూర్ లోని తుంగభద్రా నదీ తీరంలో కూడా అపర ఖర్మలు జరుపుకొంటారు.
చతుర్భుజ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి నిలువెత్తు విగ్రహం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
రాతి కిటికీలు వాటి పైన చెక్కిన సుందరమైన సూక్ష్మ చెక్కడాలు సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి.
గర్భాలయంలో లింగరూపంలో శ్రీ సంగమేశ్వర స్వామి కొలువై ఉంటారు.
ప్రదక్షిణా ప్రాంగణంలో నిలువెత్తు వీరాంజనేయస్వామి దక్షిణా ముఖుడై ఉంటారు.
ఆలయ పూజారితో నా మిత్రులు ప్రసాదు ( గుంటూరు ), మదన్ ( ఆలంపూర్).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి