శ్రీ యోగాంజనేయ స్వామి ఆలయం
శోలింగనూర్ లో శ్రీ యోగ నారసింహ స్వామి వెలసిన పెరియ మలకు ఎదురుగా చిన్న మల మీద పడమర ముఖంగా ఉన్న ఆలయంలో కొలువై ఉంటారు శ్రీ యోగాంజనేయ స్వామి.
రెండిటి మధ్య దూరం ఒక కిలోమీటరు ఉంటుంది. నడిచి వెళ్ళ వచ్చును.
వాహనాల మీద కూడా పర్వత పాదాల వద్దకు చేరవచ్చును.
ఈ క్షేత్రంలో అంజనా సుతుడు స్థిర నివాసం ఏర్పరచుకోడానికి సంబంధించిన పురాణ గాధ ఇలా ఉన్నది.
లోకాలను తన పాలనలో ఉంచుకొని, సమస్త లోక జనులను హింసిస్తున్న "కుంభోదరుడు" అనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు సిద్దమయ్యాడట "ఇంద్రదుమ్యుడు" అనే రాజు.
అతనికి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇతర దేవతలు కూడా తమ ఆయుధాలను, శక్తులను అందించారట.
శ్రీ నారసింహుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు, స్వామి వారి శంఖు చక్రాలను ధరించి రాక్షస వధలో రాజుకి తమ వంతు సహాయం అందించారట.
అసురుని అంతం చేసిన తరువాత కేసరీ నందనుడు తన స్వామికి ఎదురుగా యోగ ముద్రలో ఉండి పోయారని చెబుతారు.
కొండ ఎక్కే క్రమంలో పెరియ మల ఇలా కనిపిస్తుంది చిన్న మలై నుండి.
మొత్తం 406 మెట్లు.
ఆలయ ప్రాంగణానికి తూర్పుదిశగా చిన్న మూడు అంతస్తుల గోపురం నిర్మించారు.
పుష్కరణికి కొత్త మెరుగులు దిద్దారు.
ఒక వైపున పురాతన మండపాలు, దక్షిణాన చిన్న గోపురం తో కూడిన ద్వారం ఉన్నది.
కోనేరు మధ్యలో నిర్మించిన చిన్న మండపంలో సుదర్శన చక్రాన్ని ఉంచటం విశేషం.
పుష్కరణి 2009 లో పై విధంగా ఉండేది.
గ్రహ దోషాలను తొలగించే వానిగా స్వామి ప్రసిద్ది.
అంటే కాదు మానసిక వాధ్యులతో, గాలి ధూళి సోకిందని భావించే వారిని తీసుకొని వచ్చి ఈ కోనేరులో స్నానం చేయించి నిత్యం నియమంగా స్వామి ని సేవించు కొంటె స్వస్థత చేకూరుతుందని అంటారు.
ఆ విశ్వాసంతో ఎందరో వచ్చి పదకొండు నుండి నలభై ఒక్క రోజుల వరకు ఇక్కడ ఉండిపోతారు.
అన్ని ఆరోగ్య సమస్యలకు అత్యంత శీఘ్రంగా పరిష్కారం చూపే అపర ధన్వంతరీ రూపుడీ సంజీవ రాయడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి