పోస్ట్‌లు

Up Date

చిత్రం
మహా పుస్తక క్రతువు గురించి నేను చేసిన అభ్యర్థనకు స్పందించిన తొలి వ్యక్తి శ్రీ D L V ప్రసాద్, గుంటూరు. స్వర్గస్తులైన వారి తల్లితండ్రులు కీర్తిశేషులు శ్రీ దాసరి నారాయణరావు మరియు శ్రీమతి సావిత్రి ల  గుర్తుగా Rs. 5000/- విరాళంగా అందించారు. శ్రీ దాసరి నారాయణరావు దంపతులు  వారికి నా హృదయపూర్వక కృజ్ఞతలు.  అరుణాచలేశ్వరుని ఆశీస్సులు  వారికి వారి కుటుంబానికి సదా అండగా ఉండాలని కోరుకొంటున్నాను.  

Mattapalli

చిత్రం
  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి   కృష్ణానదీ తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలు  మంగళగిరి, వేదాద్రి, కేతవరం, వాడపల్లి మరియు మట్టపల్లి. ఇవన్నీ భక్తజనుల అభిమాన దర్శనీయ క్షేత్రాలు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రంలో భాగమైన మట్టపల్లి అనాది కాలం నుండి పూజ్యనీయ తీర్ధపుణ్య క్షేత్రం.   ఇక్కడ స్వామి స్వయంవ్యక్త మూర్తి. వేదకాలంలో సప్త మహర్షులు స్వామిని సేవించుకొన్నారని తెలుస్తోంది. ఇప్పటికీ గర్భ గుహలో ఉన్న సొరంగ మార్గం ద్వారా మహర్షులు బ్రాహ్మి ముహూర్తంలో నదిలో స్నానమాచరించి స్వామిని సేవించుకోడానికి వస్తారని చెబుతారు. ఇలా ఋషి పుంగవుల పూజలు అందుకొన్న నారసింహుని దర్శనం మనం పొందడానికి సంబంధించిన కధ ఇలా ఉన్నది.  వెయ్యి సంవత్సరాల క్రిందట కృష్ణా నదికి ఆవలి ఒడ్డున ఉన్న తంగెడ గ్రామానికి చెందిన మాచిరెడ్డి మోతుబరి రైతు. ఆధ్యాత్మిక భావాలు, భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు కలిగినవాడు. సాధుసన్యాసుల పట్ల గౌరవభావాలు కలిగినవాడు. దాత.  ఒకనాడు పొలంలో మినిములు నాటడానికి కోడలిని విత్తనాలను తీసుకొని రమ్మని తాను  కుమా...

Request

చిత్రం
                                            విన్నపము   ఆదిదేవుని అనుగ్రహంతో, భగవద్భక్తుల సహాయ సహకారాలతో నేను సంకలనం చేసిన               " అరుణాచల శివ.... అరుణాచల శివ.... అరుణాచల" పుస్తకాన్ని సంవత్సరకాలంలో రెండు ముద్రణలు వేయించి, పంచడం జరిగింది. తొలి ముద్రణకు శ్రీ లక్కరాజు శివరామ కృష్ణా రావు దంపతులు ( Arora, Chicago, USA) ధన సహాయం చేయగా, రెండవ ముద్రణకు కావలసిన పైకాన్ని మొదటి ముద్రణ పుస్తకం అందుకొన్న ఆదోని, విజయవాడ, ఒంగోలు భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్ సంఘం సభ్యులు, మిగిలిన ప్రాంతాల భక్తులు కొంత భాగం అందించారు. మిగిలినది నేను కలిపి ముద్రించడం జరిగింది. వీరందరికీ నా కృతజ్ఞతలు. ప్రస్తుతం మూడో ముద్రణ చేయడానికి సంకల్పించడం జరిగింది.  గత రెండు ముద్రణలు సమయంలో చేసినట్లే కావలసిన కొన్ని మార్పులు చేయడం జరిగింది. కొత్త విషయాలను జోడించడం కూడా చేసాను.  అరుణాచల శివ.... అరు...

Mellacheruvu

చిత్రం
  శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం, మేళ్లచెరువు ఇదొక అద్భుత ఆలయం. అంటే తమిళనాడులో మాదిరి శిల్పకళ కనపడుతుంది అని కాదు. నెలకొన్న విశేషాల మూలంగా ! ఇలాంటి ఆలయ సందర్శనా భాగ్యం అరుదుగా లభిస్తుంది.  తొలిసారి నేను పదిహేను సంవత్సరాల క్రిందట దర్శించుకొన్నాను. దురదృష్టవశాత్తు ఆ రోజు నా దగ్గర కెమెరా లేకపోయింది. ఉండి ఉంటే అప్పటి ఆలయ స్వరూపం నేడు కనిపిస్తున్న అభివృద్ధి అందరికీ చూపించగలిగే వాడిని.  ఆలయ విషయం పక్కన పెడితే శివతత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించే స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక అద్భుత అనుభవం.    కొన్ని వందల  సంవత్సరాల క్రిందట ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. చక్కని పచ్చిక బయళ్లతో నిండి ఉండేదట. అందువలన చుట్టుపక్కల ఉన్న పల్లెల లోని పశువుల కాపరులు తమ గోవులను మేతకు ఇక్కడికి తీసుకొని వచ్చేవారట. వాటిల్లో ఒక ఆవు ప్రతి రోజు వెళ్లి సమీపంలోని గుండ్రని శిల  మీద పొదుగు నుండి పాలను ధారగా వదిలేదట. అది ఒక అద్భుతంగా భావించిన పశువుల కాపరులు తమ గ్రామాధికారులకు తెలియచేశారట. వారు వచ్చి త్రవ్వి చూడగా శివలింగం బయల్పడిన...

Malemalayanur

చిత్రం
   శ్రీ అంగాలమ్మ పరమేశ్వరి ఆలయం, మేల్మలయనూర్                                                                                                                                   భారత దేశంలో ప్రజలకు ఆధ్యాత్మిక భావాలు అధికం. దైవశక్తి మీద భక్తి, విశ్వాసం మెండు. ఈ కారణంగానే ప్రతి గ్రామంలో ఒకటి కన్నాఎక్కువ ఆలయాలు కనపడతాయి. శివుడు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుడు ఆదిగా గల దేవతలు అక్కడ కొలువై ఉంటారు. వీరే కాక గ్రామానికొక దేవత ఉండడం కూడా మనం చూడవచ్చును.  గ్రామ దేవతగా వివిధ నామాలతో పిలుచుకునే ఈమె ఆదిశక్తికి ప్రతిరూపం. గ్రామస్థులను సకల కష్టాల నుండి కాపాడే దేవత.వారు ఆమెకు నిత్య పూజలతో పాటు పర్వదినాలలో ప్రత్యేక పూజలు, సంవత్సరంలో ఒక రో...