17, జూన్ 2018, ఆదివారం

Request


                                            విన్నపము 


ఆదిదేవుని అనుగ్రహంతో, భగవద్భక్తుల సహాయ సహకారాలతో నేను సంకలనం చేసిన               " అరుణాచల శివ.... అరుణాచల శివ.... అరుణాచల" పుస్తకాన్ని సంవత్సరకాలంలో రెండు ముద్రణలు వేయించి, పంచడం జరిగింది. తొలి ముద్రణకు శ్రీ లక్కరాజు శివరామ కృష్ణా రావు దంపతులు ( Arora, Chicago, USA) ధన సహాయం చేయగా, రెండవ ముద్రణకు కావలసిన పైకాన్ని మొదటి ముద్రణ పుస్తకం అందుకొన్న ఆదోని, విజయవాడ, ఒంగోలు భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్ సంఘం సభ్యులు, మిగిలిన ప్రాంతాల భక్తులు కొంత భాగం అందించారు. మిగిలినది నేను కలిపి ముద్రించడం జరిగింది. వీరందరికీ నా కృతజ్ఞతలు. ప్రస్తుతం మూడో ముద్రణ చేయడానికి సంకల్పించడం జరిగింది. 
గత రెండు ముద్రణలు సమయంలో చేసినట్లే కావలసిన కొన్ని మార్పులు చేయడం జరిగింది. కొత్త విషయాలను జోడించడం కూడా చేసాను. 












అరుణాచల శివ.... అరుణాచల శివ.... అరుణాచల పుస్తక మూడో ముద్రణకు సిద్ధపడిన సమయంలో మరో ఉపయుక్తమైన పుస్తకం ప్రచురించాలన్న సంకల్పం కలిగింది. అది "జన్మ నక్షత్ర మరియు జన్మ రాశి ఆలయాలు"గా రూపు దిద్దుకొన్నది. ఈ పుస్తకంలో భక్తులు తమ జన్మ నక్షత్రం మరియు జన్మ రాశి ప్రకారం ఏ ఏ ఆలయాల్లో కొలువైన దేవీదేవతలు సందర్శించాలి, ఏ విధమైన పూజలు జరిపించుకోవాలి,  అన్న వివరాలతో పాటు ఆ క్షేత్రం గురించిన విశేషాలు వీలైనంత పొందుపరచాము. మొత్తంగా వంద పైచిలుకు పురాతన ఆలయాల సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. తమిళనాడు లోని ప్రసిద్ధ క్షేత్రాలైన శ్రీరంగం, మదురై, కుంభకోణం, తంజావూరు, చిదంబరాల చుట్టుపక్కల ఉన్న ఈ ఆలయాల సమాచారం పర్యాటకం పట్ల ఆసక్తి గలవారికి ఉపయుక్తం. అదే విధంగా తమకు సంబందించిన ఆలయాన్ని సందర్శించే అవకాశం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. దీని వలన భగవంతుని అనుగ్రహంతో ఇహపర సుఖాలను పొందడానికి మార్గం సుగమనం చేసుకోవచ్చును. 











ఇంటర్నెట్, ఫేసుబుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్ ఇలాంటి ఎన్నో సమాచార వాహకాలు అందుబాటు లోనికి వచ్చిన తరువాత ప్రజలు పుస్తకాలు చదవడం అన్నది మరచి పోయారు. పోనీ ఈ మాధ్యమాల ద్వారా లభించిన / లభిస్తున్న సమాచారం సంపూర్ణంగా నమ్మదగ్గదా అంటే ఎవరూ చెప్పలేరు. పోనీ చదివిన దాన్ని అర్ధం చేసుకొంటున్నామా ? అన్నది మరో ప్రశ్న. 
ఈ ప్రశ్నలకు తగిన సమాధానం పుస్తకం. రచయిత ఎంతో పరిశ్రమ చేసి, వివిధ మార్గాల ద్వారా విషయం సేకరణ చేసి పూర్తిగా విశ్వసించదగిన మరియు పాఠకులకు ఉపయుక్తమైన దానిని అందిస్తాడు.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రజలలో ఆలయ సందర్శనాభిలాష పెరిగింది. కానీ ఒక ఆలయాన్ని ఏవిధంగా సందర్శించాలి అన్న విధానాన్ని అనుసరించడం లేదని చెప్పడానికి  భాధ పడుతున్నాను.ఎందుకంటే నేను స్వయంగా అనేకానేక ఆలయాలను సందర్శించిన సమయంలో గమనించిన విషయమిది. వచ్చామా ! దర్శించుకొన్నామా ! యెంత తొందరగా బయట పడదామా ! అన్న ఆలోచన తప్ప ఆ ఆలయ ప్రత్యేకత, పురాణగాథ, అక్కడి విశేషాలను, ఆచార వ్యవహారాల గురించి ఎలాంటి ఆసక్తి చూపించడము లేదు. అలా తెలుసుకొని సందర్శించుకొన్న విశేషాలను పది మందికీ తెలియచేసే అవకాశం దక్కుతుంది. నేడు మనందరం వింటున్న క్షేత్ర విశేషాలు అలా వ్యాప్తి లోనికి వచ్చినవే కదా !
మన జీవితాలలో ఒక క్షేత్రాన్నిఒకసారి దర్శించే అవకాశం అదృష్టం కొద్దీ లభిస్తుంది.మరో సారి వెళతామా? అన్నది అనుమానమే! అందువలన లభించిన  అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి అన్నది పెద్దల మాట. అలా యాత్రీకులు ప్రతి ఒక్కరూ తమ యాత్ర యొక్క ఫలితాన్నిపూర్తిగా పొందడానికి ఉపయోగపడేలా ఇలా పుస్తకాలు ఉచితంగా పంచాలన్న ఆలోచన కలిగింది. 
 ఒక పుస్తక ప్రచురణకు  16/- రూపాయలు అవుతుంది. అది కూడా వెయ్యి కాపీలు వేయిస్తే ! ఒక ముద్రణ ద్వారా రెండు నుండి మూడు వేల మంది దాకా ఒక మహా క్షేత్రం గురించిన సమగ్ర సమాచారాన్ని పొందుతారు.అది అక్కడితో ఆగదు. ఆ పుస్తకం మరి కొంత మందికి చేరే అవకాశాన్ని కాదనలేము. 
ఇంతటి ఉపయోగం ఉన్నది ఒక పుస్తకం వలన ! పుస్తక దానం అన్నది వేసవిలో దప్పిక గొన్న వారికి నీరు అందించినంత మహత్తర కార్యం. అత్యంత పుణ్యఫలం. అందువలన మీ అందరినీ చేతులు జోడించి అభ్యర్ధించే విషయం ఏమిటంటే మీరు కూడా ఈ,  మహా పుస్తక క్రతువులో భాగస్వామ్యులు కమ్మని !
మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఒక మహత్కర కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. తద్వారా భక్తులు చేసే పుణ్య యాత్రలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొన్నట్లే కదా!  మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆలోచన,ఆశయం, ఆసక్తి,ప్రణాళికా ఉన్నాయి కానీ తగిన ఆర్ధిక స్థోమత నాకు లేక పోవడం! 
ఈ మహా పుస్తక వితరణ కొనసాగాలంటే మీ అందరి సహాయసహకారాలు అత్యంత అవసరం !
దయచేసి మీరు మీ వంతు విరాళాలను ఈ క్రింది బ్యాంకు అకౌంట్ కి పంపి మీ యొక్క అమూల్యమైన సహకారం అందించగలరు అని విశ్వసిస్తూ 

I.J.Venkateshwerlu, ICICI, M G Road br, VIjayawada. A/c no. 630601522726, ifsc code. icic0006306.

I J Venkateshwerlu, UCO Bank, M G ROAD br, Vijayawada A/c.no.17520110018934, ifsc code UCBA0001752


  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...