పోస్ట్‌లు

Village Temples of Nellore

చిత్రం
              నెల్లూరు పల్లెలలో నెలకొని ఉన్న ఆలయాలు  నెల్లూరు ఎప్పుడు వెళ్లినా వరిగొండ గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దర్శనానికి తప్పకుండా వెళతాను.  ఈ మధ్య వెళ్లినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వరిగొండ గ్రామంలోనే దేవళాల మిట్ట లో ఉన్న రెండు పురాతన ఆలయాలను సందర్శించుకునే అదృష్టం దక్కింది.  ఒకటి శ్రీ జనార్ధన స్వామి వారిఁగి కాగా రెండవది శ్రీ కామాక్షీ సమేత శ్రీ బ్రహ్మీశ్వర స్వామి ఆలయం. రెండు ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి .  ఆలయాల చరిత్ర గురించి తెలుసుకోడానికి ప్రయత్నం సఫలం కాలేదు.  కానీ మరో రెండు పురాతన చక్కని నిత్య పూజలు జరుగుతున్న దేవాలయాలను దర్శించుకున్న అనుభూతి లభించింది.  నమః శివాయ !!!!

Our KOlkata Tour

చిత్రం
                                          మా కలకత్తా పర్యటన  అమెరికా లో ఉన్న మా అమ్మాయి వద్దకు వెళ్ళాలి. దానికి కావలసిన వీసా కోసం ప్రయత్నం చేస్తే కలకత్తా లో దొరికింది. నేను నా భార్య మణి మాల దురంతో ఎక్సప్రెస్ లో చేరుకున్నాము.  వీసా కోసం అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్ళడానికి రెండు రోజుల సమయం ఉండటంతో కలకత్తా లో కొన్ని ప్రదేశాలను దర్శించుకొన్నాము. మూడో రోజు మాకు వీసా లభించింది. సంతోషంగా తిరిగి విజయవాడ కోరమాండల్ ఎక్సప్రెస్ లో తిరిగి వచ్చాము.  మా కలకత్తా పర్యటన సందర్బంగా తీసుకొన్న చిత్రాలు.   

SriGarbarakshambikai Temple, Thirukkaragavur

చిత్రం
                               శ్రీ గర్భరక్ష అంబిక ఆలయం     కైలాస నాధునికి పుడమిలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. వాటిల్లో ఒకే అంశం మీద పరమశివునికి ఉన్న ఆలయాలు మరే దేవతామూర్తికి లేకపోవడం విశేషం.  పంచ సభలు, పంచ భూత స్థలాలు, సప్త విదంగ స్థలాలు, సప్త స్థానాలు, సప్త మాంగై క్షేత్రాలు, ఆధార స్థలాలు, తిరుఓట్టం ఆలయాలు(కన్యాకుమారి దగ్గర), అష్ట వీరట్ట క్షేత్రాలు, పడాల్ పెట్ర స్థలాలు. తేవర వైప్పు స్థలాలు, పంచారామాలు ఇలా ఎన్నో కలవు, వీటిలో అధిక భాగం తమిళనాడులో ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఈ కోవ లోనివే తంజావూర్ చుట్టుపక్కల నెలకొని ఉన్న పంచారణ్య క్షేత్రాలు. .గతంలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన అటవీ ప్రాంతంగా ప్రసిద్ధి చెందినవి. అలా లయకారుడు కొలువైన ప్రాతంలోని అరణ్యాన్ని బట్టి అక్కడి చెట్ల పేరుతో ఆ క్షేత్రాన్ని అక్కడ వెలసిన స్వామిని పిలవసాగారు.  ఆ విధిగా ఏర్పడినవే ఈ పంచరణ్య క్షేత్రాలు. ఇవి వరుసగా 1. శ్రీ గర్భరక్షా అంబిక దేవాలయం, తిరుకరుగవూర్ 2. ఆవలివనల్లూరు సచ్చినాథర్ ఆలయం,తిరువారూర్ 3. హరిద్వా...