Ananta Basubeva Temple, Bhubaneswar
శ్రీ అనంత వాసుదేవ ఆలయం జగన్నాథ భూమిగా ప్రసిద్ధి చెందినది ఉత్కళదేశం. అదే నేటి ఒడిశా. శ్రీమన్నారాయణుడు శ్రీ జగన్నాథునిగా సోదరుడు శ్రీ బలదేవ మరియు సోదరి శ్రీ సుభద్ర దేవి సమేతంగా కొలువు తీరిన ఏకైక క్షేత్రం పూరీ. స్వామి వారి రూపం, వారికి చేసే ఉత్సవాలు, ముఖ్యంగా శ్రీ జగన్నాథ రధోత్సవం ప్రవంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. లక్షలాది మంది దేశ విదేశీయ యాత్రికులను పూరీ కి రప్పిస్తున్నాయి. సుందర సాగర తీరం పూరీకి గల అదనపు ఆకర్షణ. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఆలయాల నగరంగా పేరు. ఒకప్పుడు వెయ్యి ఆలయాలు ఉండేవని అంటారు. గతంలో ఏకామ్ర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన భువనేశ్వర్ లో నేడు సుమారు ముప్పై దాకా శిధిల మరియు పూజాదికాలు నిర్వహించబడుతున్న ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిరంతరం జరుగుతున్న త్రవ్వకాలలో అనేక శిధిలాలు వెలుగు చూస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది శ్రీ లింగరాజ ఆలయం. మిగిలిన వాటిలో కూడా శివాలయాలు అధికం. వాటి మధ్యలో మరో ముఖ్యమైనది శ్రీ అనంత వాసుద...