పోస్ట్‌లు

A Request

చిత్రం
                                                విన్నపము   చాలా కాలం నుండి నా బ్లాగ్ ని అనుసరిస్తూ, నేను రాస్తున్న ఆలయ విశేషాలను చదువుతూ మరిన్ని   అందించడానికి ప్రోత్సహిస్తున్న వారెల్లరికీ నా కృతజ్ఞతలు. నా పూర్వ జన్మ పుణ్యం, నా గురువుల, నాకు జన్మనిచ్చిన  తల్లితండ్రుల , మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో, నా ప్రాణ స్నేహితుల సహాయంతో నా పై అధికారుల మరియు సహా ఉద్యోగుల సహకారంతో ఎన్నో అపురూప అరుదైన పురాతన ఆలయాలను సందర్శించే మహత్తర అవకాశం లభించింది. ఆ వివరాలలో కొన్నింటిని అందరితో పత్రికా ముఖంగాను  (ప్రచురించిన ఆంద్ర జ్యోతి, ఆంద్ర భూమి, వార్త, భక్తి సుధ, చిత్ర  మొదలగు పత్రికల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు) చాలా వాటిని ఈ బ్లాగ్ ద్వారా పంచుకొనే భాగ్యం దక్కింది. ఈ క్రమంలో అందుకొన్న భగవంతుని కరుణా కృపాకటాక్షాలు ఎనలేనివి. చూడాలని అనుకొన్న క్షేత్రాన్ని ఏదో రకంగా చూసే అదృష్టం సొంతం చేశారు ఆ దేవదేవుడు. ప్రతి యాత్రలో ఒక్కో విధమైన మరపురాని ...

pradosha Puja

చిత్రం
                                                ప్రదోష పూజ   ప్రతి రోజు ప్రాతః కాలంలో శ్రీ మహా విష్ణు ఆలయ సందర్శన, సాయం సంధ్యా సమయంలో శివ దర్శనం సర్వ శుభాలను కలిగిస్తాయని పురాణాలు, గ్రంధాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకులు తెలుపుతున్నారు. సకల జీవులను రక్షించేవాడు హృదయాన సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని నిలుపుకొన్నశ్రీహరి దర్శనం ఇహలోక సుఖాలను, ప్రదోష సమయంలో లయకారుడైన మహేశ్వర దర్శనం సర్వ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేదిగా పేర్కొంటారు. అందుకే శివాలయాలలో ప్రతి నిత్యం జరిపే ప్రదోష కాల (సాయంత్రం పూట ) పూజకు ప్రాధాన్యత అధికం. మాసానికి రెండుసార్లు వచ్చే త్రయోదశి నాడు చేసే ప్రదోష పూజ అన్నింటికన్నా విశేషమైనది. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు గంటన్నర తరువాత గంట అంటే మొత్తం రెండున్నర గంటల కాలాన్ని ప్రదోష సమయం అంటారు. ఈ ప్రదోష పూజ, వ్రతం గురించి స్కాంద పురాణం, శివ పురాణాలలో పేర్కొనబడినది. అమావాస్యకు, పౌర్ణమికి రెండు రోజుల ముందు వ...

Yanamalakuduru Temples

చిత్రం
    శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, యనమలకుదురు   నిత్యస్మరణీయ నామం నమః శివాయ ! పరిపూర్ణ భక్తిభావంతో నామాన్ని స్మరిస్తే చాలు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పరమ శివుడు భూలోకంలో అనేక  ప్రాంతాలలో స్వయంభూ లింగరూపంలో  కొలువుతీరి ఉన్నారు. మరికొన్ని చోట్ల అవతార పురుషులు, మహర్షులు, భక్తులు శతాబ్దాల క్రిందట ప్రతిష్టించారు. అవన్నీ నేడు ప్రసిద్ధ శివ క్షేత్రాలుగా పేరొందాయి.   విజయవాడ  యనమలకుదురు గ్రామంలోని "మునిగిరి"మీద కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం  రెండువకోవ లోనికి వస్తుంది.  పురాణ కాలంలో అనేక మంది మహర్షులు పవిత్ర కృష్ణా నదీ తీరం లోని ఈ పర్వతం మీద తపస్సు చేయడం వలన ఆ పేరు, సహస్రాధిక మునులు తపస్సు చేసుకొన్నకొండ ఉన్న  ఊరుగా " వేయి మునుల కుదురు" గా పిలవబడేవి అని చెబుతారు.  అదే కాల క్రమంలో "యనమలకుదురు"గా రూపాంతం చెందినట్లుగా తెలుస్తోంది.  ఏ దివ్య కారణం వలన లేదా ఏ భక్తుని కాపాడటానికి భక్త సులభుడు ఉద్భవించారో తెలియదు కానీ మహా విష్ణు ఆరో అవతార స్వరూపమైన పరశురామ...