4, ఆగస్టు 2016, గురువారం

A Request

                                                విన్నపము 


చాలా కాలం నుండి నా బ్లాగ్ ని అనుసరిస్తూ, నేను రాస్తున్న ఆలయ విశేషాలను చదువుతూ మరిన్ని   అందించడానికి ప్రోత్సహిస్తున్న వారెల్లరికీ నా కృతజ్ఞతలు.
నా పూర్వ జన్మ పుణ్యం, నా గురువుల, నాకు జన్మనిచ్చిన  తల్లితండ్రుల , మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో, నా ప్రాణ స్నేహితుల సహాయంతో నా పై అధికారుల మరియు సహా ఉద్యోగుల సహకారంతో ఎన్నో అపురూప అరుదైన పురాతన ఆలయాలను సందర్శించే మహత్తర అవకాశం లభించింది. ఆ వివరాలలో కొన్నింటిని అందరితో పత్రికా ముఖంగాను  (ప్రచురించిన ఆంద్ర జ్యోతి, ఆంద్ర భూమి, వార్త, భక్తి సుధ, చిత్ర  మొదలగు పత్రికల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు) చాలా వాటిని ఈ బ్లాగ్ ద్వారా పంచుకొనే భాగ్యం దక్కింది. ఈ క్రమంలో అందుకొన్న భగవంతుని కరుణా కృపాకటాక్షాలు ఎనలేనివి. చూడాలని అనుకొన్న క్షేత్రాన్ని ఏదో రకంగా చూసే అదృష్టం సొంతం చేశారు ఆ దేవదేవుడు. ప్రతి యాత్రలో ఒక్కో విధమైన మరపురాని మధురానుభూతిని పొందటం ఈ జన్మ పుణ్యమో!!
అలా పరిచయం అయిన వివిధ రాష్ట్రాల వారు వాట్స్ అప్, మెయిల్ ద్వారా వారు చూసిన విశేష స్థానిక ఆలయాలను ఈ నాటికీ నాకు తెలియచేయడం రమ్మని ఆహ్వానించడం అన్నీ ఆ పరమాత్మ కరుణా కటాక్షాల ప్రభావమే!! 
ఇన్ని క్షేత్రాలను దర్శించినా నా మటుకు నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పుణ్య క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. 
అలాంటి వాటిల్లో ప్రధమ స్థానం తిరువణ్ణామలై దే ! ఆ తరువాత కుర్తాళం, శబరిమల మరియు అహోబిలం వస్తాయి. 






ముఖ్యంగా అరుణాచలం సందర్శనా ప్రభావం నా జీవితంలో ఎన్నో మేలు మలుపులు కారణమైనది. ఇహలోక బంధాలతో బంధించబడిన ఒక సాధారణ మానవునికి అంతకంటే కావలసినది ఏముంటుంది !
ఎన్ని సార్లు అరుణాచలేశ్వరుని సేవించుకొనే అదృష్ట్టం దక్కిందో ! ఎన్నిసార్లు పెద్దలు నిర్ణయించిన మార్గంలో గిరివలయం చేయగలిగానో! తలుచుకుంటేనే కనుల ముందు అక్కడి ప్రదేశాలు కదలాడుతాయి. 
ఎవరైనా ఇప్పటికి ఇప్పుడు తిరువణ్ణామలై వెళదామంటే మరో ఆలోచన లేకుండా ప్రయాణమవ్వడమే !  
ఇదంతా ఆ సర్వేశ్వరుని దయే తప్ప మరొకటి కాదు. 
ఇలా దర్శించుకొనే క్రమంలో సహజ కుతూహలంతో తెలుసుకొన్న ఆ దివ్య క్షేత్రంలోని  అనేకానేక విశేషాలలో కొన్నింటిని ఈ బ్లాగ్ ద్వారా తెలపడం జరిగింది. 
శ్రీ శేషాద్రి స్వామి, శ్రీ రమణ మహర్షి లాంటి ఎందరో ఆధ్యాత్మిక మార్గదర్శకులను  అందించిన ఈ పుణ్య ప్రదేశంలో విశేషాలకు కొదవా ! కానే  కాదు !
కానీ మనలో చాలా మంది చేసే పని వెళ్ళినదాకా హడావుడి తిరిగి బయలుదేరినదాకా తొందర ! సామానులు, హోటల్ గదులు, మంచి భోజనం, రైల్లో సీట్లు వీటి మీద చూపించే శ్రద్ద ఆలయంలో గడపటానికి చూపము.
వెళ్ళేది దర్శనం కోసమే అయినా దాని మీద తప్ప మిగిలిన అన్ని విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.
ఈ క్రమంలో క్షేత్ర విశేషాల మీద ఎలాంటి ఆసక్తి చూపించము.
ఒక క్షేత్రానికి మళ్లీ మళ్లీ  వెళతామో లేదో తెలియదు. "గడచిపోతున్నఈ రోజు తిరిగి రాదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు" అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.
దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. 





మరో విచారకరమైన పరిస్థితి ఏమిటంటే ప్రముఖ ఆలయాలు ఉన్న తమిళ నాడులో ఎక్కడా కనీసం ఆంగ్లంలో అయినా ఆలయ చరిత్ర మరియు విశేషాలు తెలిపే బోర్డులు కనపడవు. అన్నీ తమిళం లోనే. ఆలయ విశేషాలను తెలిపే తమిళ భాషా పుస్తకాల సంఖ్య చెప్పలేనంత !  వారి భాషాభిమానం మెచ్చుకోతగినది.
దీనికి విరుద్దంగా మన తెలుగులో సరి అయిన సమాచారం లభించే పుస్తకాలు అరుదు.
మనకి చదివే అలవాటు తక్కువో మరింకొకటో తెలీదు.
తరచుగా నేను చేసే  శబరిమల యాత్రలో  మరియు తిరువణ్ణామలై గిరివలయంలో ఎందరితోనో పరిచయం కలుగుతుంటుంది.
ఏదో ఎక్కడో విన్న విషయం ప్రభావంతో చాలా మంది వస్తుంటారని అర్ధమై పోతుంది. ప్రతిసారి మాతో కనీసం అయిదు మంది అయినా గిరివలయం చేస్తుంటారు. అంతా అక్కడ పరిచయం అయిన వారే ! గిరివలయం గురించి మేము తెలుగులో మాట్లాడుకోవడం విని వచ్చేవారే !
అదే విధంగా శబరిమల గురించి శ్రీ ధర్మశాస్త గురించి సంపూర్ణంగా తెలియకుండానే మూడు నాలుగుసార్లు యాత్ర చేసి గురు స్వాములుగా పిలవబడే వారు ఎందరో యాత్రలో కలిసినప్పుడు నన్ను అనేక విషయాల గురించి అడుగుతుంటారు. నాకు తెలిసిన మటుకు చెబుతుంటాను.
ఒక క్షేత్రం గురించి పూర్తిగా తెలుసుకొని చేసే యాత్ర అర్ధవంతంగా, ఆనందకరంగా, చెదిరి పోని జ్ఞాపకంగా
మిగిలిపోతుంది.



కుర్తాళం జలపాతం 






తొలి రోజుల్లో నేను కూడా అలానే తొందరపడే వాడిని. కానీ కొందరు యాత్ర గురించి అడిగే ప్రశ్నలు నాలో నేను చేస్తున్న యాత్ర ద్వారా ఏమి తెలుసుకున్నాను ? ఊరికే వెళ్లి రావడం వలన చేతికి అంది వచ్చిన అవకాశం వదులుకుంటున్నాను ! అన్నవిషయం స్పష్టంగా తెలిసింది. అలా కలిగిన కనువిప్పుతో నాటి నుండి చేసిన క్షేత్ర సందర్శన క్రమంలో నా పద్దతిని పూర్తిగా మార్చుకున్నాను. ప్రయాణ తేదీ నిర్ణయించుకున్నాక వెళ్లబోయే ప్రాంతం యొక్క చరిత్ర, వివరాలు, దర్శించబోయే ఆలయ చరిత్ర విశేషాలు, చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాల వివరాలు వివిధ మార్గాలలో సేకరించడంతో పాటు ఆ యా ప్రదేశాలలో ఉన్న పరిచయస్తులు ద్వారా మరికొన్ని వివారాలు తెలుసుకొవడం, పూర్తి యాత్రా మార్గాన్ని రూపొందించుకోవడం అదే దారిలో యాత్రను పూర్తి చేసుకోవడం.  దీని వలన సంపూర్ణ సందర్శనా భాగ్యం సొంతం అవుతుంది.
అదే ఈ బ్లాగ్ రూపంలో అందరితో అనుభూతులు పంచుకునేలా చేస్తోంది.
సాటి వారికి కూడా ఆ అనుభూతిని కలిగించడానికా అన్నట్లు నాకు కొంతకాలం క్రిందట ఒక ఆలోచన వచ్చినది. దాన్ని ఆలోచన అనడం కన్నా "ఆదేశం" అనడం సరైన పదం ! తిరువణ్ణామలై లో గిరివలయం చేస్తున్నప్పుడు వచ్చినది కాబట్టి !
అది కొన్ని ముఖ్య క్షేత్రాల సంపూర్ణ సమాచారంతో కూడిన పుస్తకాలు ప్రచురించి ఉచితంగా ఆ క్షేత్రాలలో యాత్రీకులకు పంచిపెట్టడం !
ఈ పవిత్ర కార్యక్రమానికి ఆరంభంగా తిరువణ్ణామలైతో ప్రారంభించాలని ఈ దివ్య క్షేత్రం గురించిన చాలా విషయాలు  సేకరించాను. కావలసిన చిత్రాలను కూడా తీయడం జరిగింది. వాటిల్లో కొన్నింటిని ఈ బ్లాగ్ లో ఉంచాను.
అదే విధంగా శబరిమల, కుర్తాళం క్షేత్రాలకు సంబంధించిన సమాచారం కూడా వీలైనంత సేకరించాను.
ప్రచురించడం ప్రారంభించాలి. తొలి విడతగా అయిదు వేల పుస్తకాలను ప్రచురించి పంచాలన్నది తలంపు.




శ్రీ కుర్తాళ నాదర్ ఆలయం, కుర్తాళం  

శబరిమల 

అహోబిలం 

కానీ దానికి నా ఆర్ధిక పరిస్థితి సరిపోదు. అయినా కొంత మొత్తం దాచగలిగాను. అది అయిదు వందల పుస్తకాల ప్రచురణకు సరిపోతుంది. ( ఒక్కో పుస్తక ప్రచురణ ధర ఇరవై రెండు రూపాయలు). 
ఒకేసారి మొత్తం పుస్తకాలు ప్రచురిస్తే పుస్తకం ఒక్కోటి పద్దెనిమిది రూపాయలకు వస్తుంది. 
ఈ కారణంగా నాకు తెలిసిన అందరినీ ఈ మహా కార్యక్రమంలో తమ వంతు ధన సహాయం చేసి భాగస్వామ్యులు కావలసినదిగా కోరుతున్నాను. 
ఇంత అని లేదు. ఒక్కరు ఒక్క పుస్తకాన్ని ప్రచురించడానికి కావలసిన పైకాన్ని ఇచ్చినా మహదానందం. 







పైకం పంపేవారు వారి పూర్తి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐ డి ఇస్తే  వారి వివరాలను పుస్తకంలో ప్రచురిస్తాము( అంగీకారం అయితేనే). కొన్ని పుస్తకాలను వారికి పంపుతాను. తమకు కావలసిన వారికి కానుకగా ఇవ్వవచ్చును. అదే విధంగా వచ్చిన విరాళాల తాలూకు లెక్క కూడా పుస్తకంలో ఇవ్వగలము. 
  మన క్షేత్ర విశేషాలను సంపూర్ణంగా తెలుసుకొని చేయ తలపెట్టే  యాత్ర ఫలాన్ని పూర్తిగా పొందే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అందించే ఈ మహా పుస్తక క్రతువులో అందరూ పాల్గొనాలని రెండు చేతులూ జోడించి వినయంగా అర్ధిస్తున్నాను. 
నా బ్యాంకు అకౌంట్ వివరాలు :
I.J.Venkateshwerlu, Uco Bank, M G Road Branch, Vijayawada.
A/c no. 17520110018934. UCBA0001752
Mobile no. 09052944448


సర్వేశ్వరుని దయతో సమస్త ప్రజలకు మంగళప్రదమైన జీవితం లభించాలని కోరుకొంటూ ......... 
లోకా సమస్థా సుఖినో భవంతు !!!

నమః శివాయ !!!!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...