Sri Balli Giri Sri Venkateswara Swamy Temple, Visakhapatnam
శ్రీ శ్రీ శ్రీ బల్లి గిరి వెంకటేశ్వర స్వామి ఆలయం , విశాఖ పట్టణం కలియుగ వరదుడు ఎన్నో స్థలాలలో స్వయంభూగా వెలసి భక్తులకు తమ సేవా భాగ్యం ప్రసాదిస్తున్నారు. శ్రీ వారి కృపాకటాక్షాలకు ప్రాంతీయత లేక మతం ప్రతిబంధకాలు కావని, అదేవిధంగా సర్వాంతర్యామి ఏ రూపం లోనైనా తన శరణు కోరిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా కరుణించి కష్టాల కడలి తీరం చేరుస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రం శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. భారత దేశంలో సుందర సాగర తీర నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందినది విశాఖ పట్టణం. "సిటీ ఆఫ్ డెస్టినీ" గా పేరొందిన ఈ నగర మధ్యలో ఉన్న డాభా గార్డెన్స్ ప్రాంతంలో చిన్న కొండ (స్థానికంగా వెంకటేశ్వర గుట్ట అనిపిలుస్తారు)బల్లిగిరి అనే పేరు రావడానికి, ఇక్కడ బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడానికి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది అని తెలియవస్తోంది. పదిహేడో శతాబ్దం లో కొందరు డచ్ వ్యాపారులు సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా చిన్నగా ప్రారంభమైన వాన భీకర తుఫాన్ ...