Sri Venkateswara Swami Temple, Mallavaram (Prakasham District)
నారదుడు ప్రతిష్టించిన నారాయణుడు కలియుగ వరదుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరి భక్తులకు వరప్రదాయనునిగా దర్శమిస్తున్నారు. మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా స్వామి స్థానం ఏర్పరచుకున్నారు. అయినా సమస్త భూమండలానికి అధిపతి అయిన ఏమిటి పర ఏమిటి ? దేశవిదేశాల విషయం వదిలేస్తే మన రాష్ట్రంలోనే ఉన్న అనేక శ్రీనివాసుని కోవెలల విషయం మనలో చాలా తెలియదు. అలాంటి ఒక పుణ్య తీర్ధ క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మల్లవరం. నాలుగు యుగాలలో ప్రసిద్ధికెక్కిన క్షేత్రం మల్లవరం. చరిత్రలో స్థానం పొందిన ప్రదేశం మల్లవరం. భక్తులకు దర్శనీయ ఆలయం మల్లవరం. పురాణగాథ ఒకనాడు గరుడవాహనుడు ఆకాశ మార్గాన వెళుతూ నదీతీరంలో పచ్చని ఫలవృక్షాలతో నిండిన పర్వత శోభను చూసి దిగి కొంతసేపు విహరించారట. ఈ ఉదంతాన్ని లోకసంచారి నిరంతర నారాయణ మంత్ర జపధారి అయిన నారద మహర్షి ఇక్కడ తపస్సు చేసుకొంటున్న మునులకు తెలియచేశారట. మునివాటికగా ప్రసిద్ధికెక్కిన నదీతీరం లోని మహర్షులకు ఎవరిని అ...