Sri Bagalamukhi Temple, Chendolu
వరదాభయప్రదాయని శ్రీ బగళా ముఖి అమ్మవారు త్రంత్ర విధానంలో దశ మహా విద్యలు అని ఉన్నాయి. అవి వరుసగా శ్రీ కాళీ దేవి, శ్రీ తారా దేవి, శ్రీ షోడశీ దేవి, శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ త్రిపుర భైరవీ దేవి, శ్రీ చిన్న మస్తా దేవి, శ్రీ ధూమావతీ దేవి, శ్రీ బగళాముఖీ దేవి, శ్రీ మాతంగీ దేవీ, శ్రీ కమలాత్మికా దేవి. ఈ దేవతలను తంత్ర పూర్వక విధానంలో పూజిస్తే సకలాభీష్టాలు నెరవేరతాయని చెబుతారు. వీరిలో ఎనిమిదవ విధ్యాధిపతి శ్రీ బగళా ముఖీ దేవి. ఈమెనే స్థంభన దేవత, పీతాంబరి అని కూడా పిలుస్తారు. ఈమె భక్తులకు శత్రువుల మీద విజయాన్ని ప్రసాదిస్తారు అని అంటారు. ముఖ్యంగా కోర్టు కచేరీలలో విజయాన్ని ప్రసాదించడమే కాకుండా వారి అజ్ఞానాన్నితొలగిస్తారని గ్రంధాలు తెలుపుతున్నాయి. "బగళ" అన్న పదం "వల్గా" అన్న పదం నుండి పుట్టినది అంటారు. వల్గా పదానికి "కట్టు, నిరోధించు,ఆపు చేయు" అన్న అర్ధాలు ఉన్నాయి. అంటే అమ్మవారు భక్తులను కష్టాలను నిరోధించేదానిగా ప్రసిద్ధి. కాలక్రమంలో వల్గా ఉచ్చారణ దోషాల వలన బగళ గా మారింది అని తెలుస్తోంది. పసుపువర్ణ వస్త్రాలు ధర...