పోస్ట్‌లు

Swetharka Sri Hanuman Temple, Machilipatnam

చిత్రం
      శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం  శ్రీ గణపతి, శ్రీ దుర్గ, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్ర స్వామి, శ్రీ హనుమంతుడు వీరి ఆలయాలు లేని ఊరు భారత దేశంలో కనపడదు. ముఖ్యంగా రామదూత హనుమాన్ శివకేశవ బేధం లేకుండా అన్ని ఆలయాలలోనే కాదు, పెద్ద పెద్ద వటవృక్షాల క్రింద, రహాదారుల ప్రక్కన అడుగు రూపం నుండి వంద అడుగుల విరాట్రూపాలలొ కనపడుతుంటారు.  వానర వీరుడు కేసరికి, అంజనా మాతకు వాయుదేవుని అంశతో జన్మించిన మారుతి,రుద్రాంశగా పేర్కొంటారు. వాయునందనుడు వరపుత్రునిగా జన్మించిన అంజనాద్రి ప్రఖ్యాత చారిత్రక ప్రదేశం అయిన హంపీ దగ్గరలోని అనెగొంది. విజయనగర రాజుల తొలి రాజధాని. తుంగభద్రా నాదీ తీరంలో, పంపా సరోవరానికి చేరువలో ఉన్న అంజనాద్రి పర్వతం మీద శ్రీ అంజనాదేవి ఆలయం ఉంటుంది. కోతి అంటే చంచలత్వానికి ప్రతీక. ఒక చోట కాలు నిలువదు. దానికి అవసరం లేక అనవసరం అనదగ్గ విషయం లేదు. అన్నింటిలో వేలు పెడుతుంది. మన మనసు కూడా అంతే కదా ! వానరం అత్యంత చంచలమైన మానవ ఆలోచనలకు, మనస్సుకు ప్రతిరూపం. హనుమంతుడు  అనగా నిశ్చల భక్తికి, ఏకాగ్రతకు, స్పష్టతకు,...

Airavateswarar Temple, Darasuram

చిత్రం
              శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం, ధారసురం                 ఐరావతం కొలిచిన శ్రీ ఐరావతేశ్వర స్వామి  ఆలయాల రాష్ట్రం తమిళనాడులో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. ముఖ్యంగా చోళ రాజుల కాలం(క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 13వ శతాబ్దం)లో నిర్మించిన ఆలయాలు మనోహరమైన శిల్పాలకు నిలయాలు. తమిళ దేశంలో ఆలయాల నిర్మాణానికి ఆద్యులు పల్లవులు. వీరి కాలంలో ఎక్కువగా నిర్మించబడినవి గుహాలయాలు. మహాబలిపురం దీనికి నిదర్శనం. చోళుల తరువాత పాండ్యులు, విజయనగర, నాయక, హొయసల రాజ వంశాల వారు కూడా చక్కని ఆలయాల నిర్మాణాలు చేశారు.  చోళుల నిర్మాణాలన్నీ విశాల ప్రాంగణంలో, రాతిని మైనపు ముద్దలా మలచగల నేర్పులైన శిల్పులు చిత్రవిచిత్రమైన శిల్పాలు, పురాణ ఘట్టాలను రమణీయంగా చెక్కారు.  చోళ రాజుల నిర్మాణాలలో ప్రతివొక్కటి ఎన్నదగ్గవే ! కానీ శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు, గంగై కొండ చోళ పురం లాంటివి ఆణి ముత్యాల లాంటివి. అదే కోవకి చెందిన మరో ఆలయం శ్రీ ఐరావతేశ్వర స్వామి కొలువైన ధారాసురం లో ఉన్నది. ...

Bhagavan Sri Ramana maharshi satsangam, Ongole

చిత్రం
            భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్సంగము, ఒంగోలు భగవాన్ శ్రీ రమణ మహర్షుల 138 వ జయంతి (30. 2. 7) సందర్బంగా ప్రపంచమంతటా ఉన్న ఆయన భక్తులు వివిధ రకాల సేవా, సత్సంగాలలో పాల్గొన్నారు. నా పూర్వ జన్మ సుకృతాన, ఒంగోలు శ్రీ రమణ మహర్షి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన సత్సంగంలో పాల్గొనే అవకాశం లభించినది.  గౌరవనీయులు, పెద్దలు అయిన శ్రీ కొప్పోలు హనుమంతరావు, శ్రీ నీలంరాజు పార్ధసారధి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ ప్రసాదరావు గార్లతో పాటు ఎందరో పెద్దల ఆశీర్వాదం అందుకొనే అదృష్టం దక్కినది.  ఇదంతా శ్రీ అరుణాచలేశ్వరుని మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షుల కరుణాకటాక్షాలతోనే సాధ్యపడినది.  ఈ కార్యక్రమానికి వెళ్లేలా నన్ను ప్రోత్సహించిన శ్రీ రావినూతల శ్రీరాములు (ప్రఖ్యాత రచయిత)గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ  మధుర క్షణాలను అందరితో పంచుకోవాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను.  కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా నమస్కారాలు.  ఓం శ్రీ అరుణాచలేశ్వ...