Sri Ganga Parvathee sametha Sri Agastheshwara Swamy Temple, Madiraju Guduru.
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్థేశ్వర స్వామి ఆలయం, మాదిరాజు గూడూరు మనం పేరొందిన క్షేత్రాల లోని ఆలయాలకు ఎక్కువగా వెళుతుంటాము. కానీ మారు మూల చిన్న చిన్న ఊర్లలో కూడా ఎన్నోవిశేష ఆలయాలు మన దేశంలో కనపడుతుంటాయి. వెళ్లే దారిలో ఎన్ని ఆలయాలను చూస్తుంటాము కానీ పట్టించుకోము. అలాంటి ఆలయాలలో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినవి, స్థానిక పాలకులు వివిధ సందర్భాలలో నిర్మించినవి, లేక గ్రామం లోని నిర్మలమైన భక్తి భావాలు కలిగిన భగవద్ససేవకులు నిర్మించినవి కావచ్చు. చక్కని నిర్మాణ విశేషాలు, పురాతన శాసనాలు లేదా ప్రత్యేక పూజలకు నిలయాలు ఆ ఆలయాలు కేంద్రం కావచ్చును. భగవంతుని కృప వలన అలాంటి కొన్ని ఆలయాలను దర్శించే అవకాశం నాకు లభించింది. ఈ మధ్యన నెల్లూరు పట్టణానికి వెళ్లిన సందర్భంలో కృష్ణ పట్టణం వైపుకు వెళ్లే పని పడినది. మధ్యలో వచ్చే "మాదిరాజు గూడూరు" అనే గ్రామంలో పురాతన శివాలయం ఒకటి ఉన్నట్లుగా తెలిసింది. దర్శించుకొందామని ఆగాము. ఏనాటిదో ఎవరు ప్రతిష్టించి నిర్మించారో తెలియరాలేదు. పేరు వలన అగస్త్య మహర్షి జరిపిన దక్షిణ దేశ యాత్ర సందర్బంగా ప్రతిష్టించిన అనేకానేక లింగాలలో ఒకటి...