Sri Lakshmi Varaha Swamy Temple,Tiruvananthapuram
శ్రీ లక్ష్మీ వరాహ స్వామి ఆలయం, తిరువనంతపురం మనం ఎన్నో ప్రదేశాలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలను సందర్శించుకొని ఉంటాము. కానీ శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో మూడవది అయిన శ్రీ వరహావతర ఆలయాన్ని ఎక్కడా చూసి ఉండము. మన రాష్ట్రం లోని సింహాచలంలో ఉన్నది శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి. తిరుమల కొండల పైన ఉన్నది ఒక వరాహ స్వామి ఆలయం. అక్కడ ఆయనే క్షేత్ర పాలకుడు. కానీ తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కొన్ని శ్రీ వరాహ స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాంటి అరుదైన క్షేత్రాలలో కేరళ రాజధాని తిరువనంతపురం లో ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెలుపల నైరుతిలో ఉన్న శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం. స్వామి వెలసినందున ఈ ప్రాంతాన్ని "శ్రీ వరాహం " అని పిలుస్తారు. కేరళలో ఉన్న మూడు శ్రీ వరాహ స్వామి ఆలయాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా పేర్కొంటారు. మిగిలినవి అలికాల్ శ్రీ వరాహ దేవస్వం, చెరాయి, కొచ్చి మరియు శ్రీ వరాహ మూర్తి ఆలయం, వరపుళ , ఎర్నాకుళం దగ్గర. అసలు భారతదేశం మొత్తం మీద ఇరవై...