26, అక్టోబర్ 2014, ఆదివారం

Sri Chenna Kesava Swamy Temple, Ongole

                          శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం, ఒంగోలు 

ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగం నేటి ప్రకాశం జిల్లా. 
1970వ సంవత్సరంలో నెల్లూరు, కర్నూలు జిల్లాల నుండి కొన్ని ప్రాంతాలను కలిపి ఆంధ్ర కేసరి గా పేరొందిన కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుమీద ఈ జిల్లా ఏర్పాటు చేయబడినది. 
శ్రీ ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్య మంత్రి. 
ఈ ప్రాంతం మౌర్యులు, శాత వాహనులు, చాళుక్యులు, పల్లవులు మరియు విజయనగర రాజుల పాలనలో ఉంది చరిత్రలో సుస్థిర స్థానం సముపార్జించుకొన్నది. 
ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏమిటంటే కోస్తాకు, రాయల సీమకు ప్రవేశ ద్వారం. 
మూడు జిల్లాల తాలుకాలు కలిసినందున అన్ని ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ కనపడతాయి. 
ప్రకాశం జిల్లాలో ఎన్నో ప్రసిద్ద ఆలయాలు కలవు. 
వాటిల్లో ఒకటి ఒంగోలు నగరం కేశవ స్వామి పేటలో  ఉన్న శ్రీ ప్రసన్న కేశవ స్వామి మరియు శ్రీ కాశి విశ్వ నాద ఆలయాల సముదాయం. 



ఈ రెండు ఆలయాలు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆఖరి పాలకులు అయిన  మందపాటి జమిందారులచే నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.
మొదట్లో సామాన్య ప్రజలకు దూరంగా కోటలో ఉండే స్వామిని  తరువాత వెలుపలకు తెచ్చి1712వ సంవత్సరంలో ఆలయం నిర్మించినారు. 
నలభై సంవత్సరాల క్రిందట స్థానిక భక్తులు శిధిలావస్థకు చేరుకొన్న పాత ఆలయానికి జీర్ణోర్ధరణ జరిపించడం వలన ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.   


నగర నది బొడ్డున చిన్న గుట్ట మీద ఉంటాయి శివ కేశవుల ఆలయాలు. 






















 చక్కని ప్రదక్షిణా ప్రాంగణంతో శుభ్రంగా ఉండే ఆలయ ప్రాంగణంలో శ్రీ రామా వసుంధరా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ భక్తాంజనేయ మరియు శ్రీ వేంకటేశ ఉపాలయాలు ఉంటాయి.

 ప్రత్యేకంగా కనపడే శ్రీ సంతాన లక్ష్మి విగ్రహం దానికి ఎదురుగా సప్త మాత్రుకల రూపాలు చెక్కిన శిల్పం అతఎంత పురాతనమైనవి.






పక్కనే ఉంటుంది శ్రీ కాశీ విశ్వనాధ స్వామి ఆలయం. 
శ్రీ వినాయక, శ్రీ వీర భద్ర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ స్వామి, చెన్నకేశవ స్వామి, శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ చెండికేశ్వర ఉపాలయాలు ఉంటాయి. 
 నవగ్రహ మండపం కూడా ఏర్పాటు చేయబడినది. 










 హరిహర నిలయం అయిన ఈ క్షేత్రంలో ప్రతి రోజు పర్వదినమే !
భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు.









 కార్తీక మరియు ధనుర్మాసాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి.
అన్ని పర్వ దినాలలో వేలాదిగా భక్తులు తరలి వస్తారు.


ఒక రకంగా ఈ క్షేత్రం ఒంగోలు పట్టణ ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పవచ్చును. 




గుట్ట కు ఎదురుగా శ్రీ ఆంజనేయ,  శ్రీ దుర్గా దేవి ఆలయాలు నిర్మించారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...