పోస్ట్‌లు

Thechikottukavu sri Bhagavathy Temple, Peramangalam

చిత్రం
                తెచ్చికొట్టుక్కావు శ్రీ భగవతి ఆలయం , పేరమంగళం   దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు తన పరశురామ అవతార సమయంలో సముద్రుని నుండి పొందిన భూమిలో నూట ఎనిమిది  చొప్పున మహాదేవ, భగవతి మరియు శ్రీ ధర్మశాస్త విగ్రహాలను ప్రతిష్టించిన సంగతి తెలిసినదే ! వాటిల్లో ఒకటి ఈ " తెచ్చికొట్టుక్కావు శ్రీ భగవతి క్షేత్రం ".  సహజంగా కేరళలో అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చాలా ఆలయాలలో సదాశివుడు మరియు అమ్మవారు ఒకే శ్రీ కోవెలలో తూర్పు మరియు పడమర ముఖంగా కొలువుతీరి ఉంటారు.  కానీ ఇక్కడ ఇరువురు వేరు వేరుగా కొలువై ఉంటారు.  ఏపుగా పెరిగిన చెట్లతో నిండిన చిన్న గుట్ట మీద విశాల ప్రాంగణంలో తూర్పు పడమరలలో ప్రవేశ ద్వారాలతో ఉన్న ఈ దేవాలయంలో శ్రీ భగవతి సమేత మహేశ్వరుని తో సహా శ్రీ వినాయక, శ్రీ భద్రకాళి, శ్రీ ధర్మశాస్త పరివార దేవతలుగా దర్శనమిస్తారు.  తూర్పు ద్వారము   రెండు ఆలయాలకు ధ్వజస్తంభాలు ఉండవు. రాతి దీప స్తంభాలు ఉంటాయి.  ఆది దంపతులు తూర్పు ముఖంగా తమ తమ శ్రీ కోవెలలో కొలువై ఉండగా, శ...

Kozhikode Temples

చిత్రం
                                    తాళి మహాదేవ ఆలయం    దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను "పరశురామ భూమి" అని అంటారు.  ఒకే యుగంలో అవతార పురుషులైన వామన మూర్తి మరియు శ్రీ పరశు రాముడు హరిహర సుతుడైన శ్రీ ధర్మ శాస్త, తదనంతర యుగాలలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ బలరాముడు నడయాడిన ప్రదేశంగాను, కలియుగంలో అపర దేవి అవతారం గా భక్తులు ఆరాధించే శ్రీ అత్తుక్కాల్ భగవతి దేవి స్థిర నివాస మేర్పరచుకొన్నందున మరియు కారణ జన్ముడు అద్వైత సిద్దాంత రూప కర్త అయిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరుల జన్మ భూమి కావడం వలన, ఆయన శిష్యులలో ఒకరైన శ్రీ విల్వమంగళ స్వామికి వైకుంఠ నాధుడు తన అనంత శయన రూపంలో దర్శనమిచ్చిన క్షేత్రం కావడం వలన కేరళను దేవతల స్వస్థలం అని పిలవడంలో ఏ మాత్రం అతిశయం లేదనిపిస్తుంది.  ఇక పరశు రామ భూమి అని పిలవడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది.  ప్రజలను కన్నబిడ్డలా మాదిరి పాలించ వలసిన పాలకులు కంటకులుగా మారి వారిని అష్ట కష్టాల పాలు చేస్తుండటంతో ఆగ్రహించారు అవతార మూర్తి.  ...