Sri Bugga Ramalingeswara swami Temple, Tadiparthi
అద్భుత కళాఖండం గతంలో మనం తాడిపత్రి నగరంలో ఉన్న చింతల శ్రీ వెంకట రమణ మూర్తి ఆలయం గురించి తెలుసుకొన్నాము. అదే ఊరిలో అంతకన్నా ముందు నిర్మించబడిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షిద్దాము క్షేత్ర గాథ బ్రహ్మ మాసన పుత్రులుగా జన్మించిన ప్రజాపతులలో ఒకరైన "పులస్త్య బ్రహ్మ" మనుమడు రావణ బ్రహ్మ. గొప్ప విద్యావంతుడు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు అయినా అసురగుణాల వలన రావణాసురునిగా పేరొందాడు. సీతా మాతను అపహరించుకొని పోయిన పాపానికి శ్రీ రామచంద్రమూర్తి చేతిలో హతుడయ్యాడు. ఎంత రాక్షస చర్యలు చేసినా జన్మతః బ్రాహ్మణుడు అవ్వడం మూలాన శ్రీరామునికి బ్రహ్మ హత్యా దోషం సంక్రమించింది. దానిని తొలగించుకోడానికి దశరధ రాముడు సాగర తీరాలలో, నాదీ పరివాహక ప్రాంతాలలో అనేక శివలింగాలను ప్రతిష్టించారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రామేశ్వరం నుండి అనేక ప్రాంతాలలో శ్రీరామ ప్రతిష్టించిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలు అధికసంఖ్యలో కనిపిస్తాయి. అదేవిధంగా శ్రీ...