పోస్ట్‌లు

64 Yogini Temple, Hirapur, Bhubaneswar

చిత్రం
                      అరుదైన ఛౌసటి యోగిని ఆలయం                                                                                                         "మీకు భువనేశ్వర్లో ఛౌసటి జోగిని మందిరం ఎక్కడున్నదో తెలుసా రాజేష్ బాబు" అనడిగాను మా ఒడిశా కొలీగ్ అయిన రాజేష్ పాల్ ని.  ఆశ్చర్యపోయాడు అతను. " సార్ ! భువనేశ్వర్ లో పుట్టి, పెరిగాను నేను. ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ ఛౌసటి జోగిని మందిరం గురించి ఎప్పుడూ వినలేదు. మీకు ఎలా  తెలుసు ?" అన్నాడు. అతనికి పురాతన, ప్రత్యేక ఆలయాల సందర్శన పట్ల నాకు గల ఆసక్తి గురించి తెలుసు.  "తొమ్మిదో శతాబ్దానికి చెందిన అరవై నాలుగు యోగినిలు కొలువైన మందిరం భువనేశ్వర్ కి దగ్గరలో హీరాపూర్లో ఉన్నదని తెలిసింది" అని జవాబిచ్చాను.  "నేను కన...

Pakshi Theerdham

చిత్రం
               శ్రీ వేదగిరీశ్వర స్వామి ఆలయం- పక్షి తీర్థం    తెలుసుకోవలసిన  విషయం ఏమిటంటే ఒక క్షేత్రం పవిత్రమైనదిగా ప్రఖ్యాతి చెందడానికి అక్కడి పురాణ గాధ, కొలువైన దేవదేవుడు, దైవానుగ్రహం పొందిన భక్తులు, ఆలయ నిర్మాణ విశేషాలు మొదలగున్నవి ప్రధాన కారణాలవుతాయి. కానీ చిత్రంగా కైలాసనాధుడు శ్రీ వేదగిరీశ్వరునిగా పూజలందుకొంటున్న ఈ క్షేత్రం పైన పేర్కొన్నవి అన్ని ఉన్నా కూడా "పక్షి తీర్ధం" గా పేరు పొందినది. మనలో చాలా మందికి ఈ క్షేత్రం గురించి తెలుసు. కొందరు స్వయంగా పక్షులు అర్చక స్వామి చేతుల మీదగా ప్రసాదం స్వీకరించడం చూసిన వారు కూడా ఉండే ఉంటారు. కానీ ఆ రెండు పక్షులకు, ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం తెలిసి ఉండక పోవచ్చును. తమిళనాడులోని అనేక విశేష శైవ క్షేత్రాలలో అగ్రస్థానంలో ఉన్నవాటిలో పక్షి తీర్థం ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చును.  ఈ క్షేత్రంతో ఎన్నో గాథలు ముడిపడి ఉన్నాయి.  పక్షి తీర్థం  అందుబాటులో లభిస్తున్న కథనాల ఆధారంగా ఈ పక్షులు  గత జన్మలో మానవులుగా పుట్టి మహర్షులుగా మారి చేసిన దైవ ధిక్కారానికి ప్రతిగా పొందిన శ...